
అందాల తార ‘రష్మిక మండన్నా’ తన సక్సెస్ ల పరంపరలో ఆల్ రెడీ మహేష్ తో నటించేసింది. ప్రస్తుతం బన్నీతో కూడా చేస్తోంది. కాగా ప్రస్తుతం తన రెమ్యునరేషన్ పై తన అభిప్రాయాలను మేకర్స్ కు నిర్మొహమాటంగా చెబుతుందట. ఎలాగూ టాలీవుడ్ లో గత నాలుగైదు సంవత్సరాలుగా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో రష్మిక మండన్నాదే ఫస్ట్ ప్లేస్. కాబట్టి ఈ మధ్య ఈ క్యూట్ బ్యూటీకి డిమాండ్ బాగా పెరిగింది.
Also Read: కేజీఎఫ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలే..!
పైగా ప్రస్తుతం టాప్ హీరోయిన్ ల లిస్ట్ కూడా తక్కువగా ఉండటం.. ఉన్న హీరోయిన్స్ లో కాజల్, తమన్నా లాంటి వారు హిట్ ట్రాక్ తప్పడం.. రష్మిక మందన్నా పోటీ ఇచ్చే వారే లేకపోవడం.. మొత్తానికి రష్మికకి తిరుగులేకుండా పోయింది. కాగా ఈ బ్యూటీ ఒక్కో సినిమాకి సుమారు రూ.2 కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది. దీనికి తోడు తన మేకప్ అండ్ తన సెటప్ ఖర్చులు కోసం అదనంగా రోజుకు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తోందట.
మరోపక్క వచ్చే నెల నుండి హిందీ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుంది. ఆ సినిమాకి ఇలాగే పుచ్చుకుంటుందట. అందుకే టాలీవుడ్ సినిమాలకు కూడా ఇంతే ఇవ్వాలని మేనేజర్ చేత నిర్మాతలకు కబురు పెట్టిందట. బాలీవుడ్ లో ఇస్తున్నంత మాత్రాన అన్ని చోట్లా అంతే ఇవ్వాలంటే.. ఎలా అనేది మన నిర్మాతల అంతర్మథనం. పైకి ఇవ్వం అని చెప్పలేని పరిస్థితి. కొంతమంది హీరోలకు రష్మిక లాంటి స్టార్ హీరోయిన్ తమ సినిమాలో నటించడం కావాలి కాబట్టి, వాళ్ళు ఎంతైనా ఇవ్వండి రష్మికకి సపోర్ట్ చేస్తారు.
Also Read: ప్రపంచ సినీ వేదిక మీద భారతీయ సినిమాకు నిరాశ !
మొత్తానికి తన డిమాండ్ ను అర్ధం చేసుకున్న రష్మిక మండన్న .. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను పక్కాగా ఫాలో అవుతూ ఏ మాత్రం మొహమాట పడట్లేదు. ఇకపోతే ప్రస్తుతం ఆమె చేతిలో బన్నీ సినిమా, అలాగే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా అదేవిధంగా అఖిల్ కొత్త సినిమా ఇలా మంచి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు కూడా హిట్టైతే 2 కోట్లును కాస్త పూజా 3 కోట్లు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమైనా ఈ మధ్య రష్మిక మండన్నా టైమ్ నడుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్