Akhanda 2 Teaser: నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రం ‘అఖండ 2′(Akhanda 2 Movie). బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ అంటేనే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటిది బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ‘అఖండ’ లాంటి సంచలనాత్మక చిత్రానికీ సీక్వెల్ అంటే ఇక ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. షూటింగ్ మొదలు కాకముందు నుండే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండేవి. ఎప్పుడైతే మొదలైందో, అప్పటి నుండి అన్ని ప్రాంతాలకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగిపోయింది. ఓటీటీ రైట్స్ కోసం అయితే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలు పోటీ పడుతున్నాయి. అభిమానులు అయితే బాలయ్య బాబు ఈ చిత్రంతో ఏకంగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడుతాడని బలమైన నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాలకు తగ్గట్టుగానే బోయపాటి శ్రీను ఎక్కడా అభిమానుల అంచనాలకు తగ్గకుండా ఈ చిత్రాన్ని తీస్తున్నాడట.
Also Read: ఐశ్వర్య రాయ్ తో నటించినందుకు రజినీకాంత్ ఇన్ని అవమానాలు ఎదురుకున్నాడా?
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. బోయపాటి శ్రీను ఇప్పటికే ఈ చిత్రంలోని ఒక షెడ్యూల్ ని మహాకుంభ మేళలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఔట్పుట్ చాలా అద్భుతంగా వచ్చిందట. త్వరలోనే మూవీ టీం మొత్తం జార్జియా కి వచ్చే నెలలో బయలుదేరుతున్నారట. అక్కడ ఒక నెల రోజుల పాటు షూటింగ్ జరుగుతుందని సమాచారం. మళ్ళీ హైదరాబాద్ కి తిరిగి రాగానే జూన్ 10 న, బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా బయటకు రానుంది. ఈ చిత్రం లో హీరోయిన్స్ గా సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు.
అదే విధంగా ప్రముఖ యంగ్ హీరో ఆది పినిశెట్టి ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. తెలుగు తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ముందుగా విజయదశమి కానుకగా, సెప్టెంబర్ 25 న విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్ అప్పటికీ పూర్తి స్థాయి లో సిద్ధం అయ్యే పరిస్థితులు లేకపోవడంతో సంక్రాంతికి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట . సంక్రాంతికి అయితే బాలయ్య మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి తో పోటీ పడాల్సి ఉంటుంది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా సంక్రాంతికే విడుదల కానుంది. ఇప్పటి వరకు సంక్రాంతి పోరు లో అత్యధిక సార్లు బాలయ్య పై చిరంజీవి విజయం సాధించాడు. కనీసం ఈసారైనా చిరంజీవి పై బాలయ్య ఆధిపత్యం చూపిస్తాడో లేదో చూడాలి. ‘అఖండ 2’ సీక్వెల్ క్రేజ్ తో వస్తున్న సినిమా కాబట్టి, కచ్చితంగా చిరంజీవి సినిమా కంటే కాస్త ఎక్కువ అంచనాలతో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.