https://oktelugu.com/

రష్మిక ఎవరినీ వదిలిపెట్టడం లేదుగా..!

స్టార్ హీరోల పక్కన వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ ఆ హీరోయిన్ మాత్రం తనకు అందరూ కావాలంటోంది. చిన్న హీరో.. పెద్ద హీరో అనే తేడా లేకుండా కథ నచ్చితే చాలు హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనే కదా? మీ ప్రశ్న.. ఆమె ఎవరో కాదు రష్మిక మందన్నా. Also Read: బాలయ్యా నువ్వు గ్రేటయ్యా.. కోటి కొట్టేశావ్.. ! ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక మందన్న […]

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2020 / 04:36 PM IST
    Follow us on

    స్టార్ హీరోల పక్కన వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ ఆ హీరోయిన్ మాత్రం తనకు అందరూ కావాలంటోంది. చిన్న హీరో.. పెద్ద హీరో అనే తేడా లేకుండా కథ నచ్చితే చాలు హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనే కదా? మీ ప్రశ్న.. ఆమె ఎవరో కాదు రష్మిక మందన్నా.

    Also Read: బాలయ్యా నువ్వు గ్రేటయ్యా.. కోటి కొట్టేశావ్.. !

    ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక మందన్న తొలి మూవీతోనే హిట్టందుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండకు జోడీగా ‘గీతగోవిందం’ మూవీలో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టవడంతో రష్మిక మందన్నకు వరుస అవకాశాలు దక్కాయి. టాప్ హీరోల సరసన నటించడమే కాకుండా సూపర్ హిట్టు మూవీలను తన ఖాతాలో వేసుకుంది.

    ఈక్రమంలో మహేష్ బాబు సరసన ‘సరిలేరునికెవ్వరు’ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ‘సరిలేరునికెవ్వరు’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. రష్మిక కెరీర్లోనే ‘సరిలేరునికెవ్వరు’ మూవీ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ చేస్తున్న సమయంలోనే నితిన్ కు జోడీగా ‘భీష్మ’లో నటించింది. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది.

    ప్రస్తుతం రష్మిక స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ మూవీలో నటిస్తోంది. రంగస్థలం దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. రష్మిక వరుసగా టాప్ హీరో పక్కన నటిస్తూ మిడిల్ రేంజ్ హీరోల సినిమాల్లోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం విశేషం. తాజాగా ఆమె శర్వానంద్ కు జోడీగా నటించేందుకు అంగీకరించడం ఆసక్తిని రేపుతోంది.

    Also Read: గర్జించిన ‘కొమురంభీం’.. రికార్డులన్నీ బద్దలు..!

    నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీలో శర్వాకు జోడీగా రష్మిక నటించనుంది. ఇంతకముందు ఈ సినిమాను విక్టరీ వెంకటేశ్ తో చేయాలని దర్శకుడు భావించినా కుదురలేదు. ఈ మూవీ చివరకు శర్వానంద్ వద్దకు చేరింది. సినిమా టైటిల్‌ను బట్టి చూస్తే రష్మిక పాత్రకు బాగానే ప్రాధాన్యం ఉండేలా కనిపిస్తోంది. ఏదిఏమైనా రష్మిక స్టార్డమ్ పట్టించుకోకుండా సినిమాలకు కమిట్ అవుతుండటంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.