
విక్టరీనే ఇంటిపేరుగా మార్చుకున్న నటుడు వెంకటేష్.. టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒకడిగా వెలుగొందుతున్నాడు.. ఆ మధ్యకాలంలో వరుసగా హిట్ సినిమాలు చేస్తూ తెలుగులో నంబర్ 1 హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ తో బాగా నవ్విస్తూ సెంటిమెంట్ విషయం లో మనల్ని ఏడిపిస్తూ ఫైట్ డైలాగ్స్ లలో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్న వెంకటేష్ అంటే ఇప్పటికీ చాలామందికి అభిమానం.. మన ఇంట్లో ఒక అబ్బాయిలాగా ఆయన పాత్రలుంటాయి. వెంకటేష్ ప్రముఖ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు గారి రెండవ కొడుకు అని అందరికి తెలిసిందే .
Also Read: బాలయ్యా నువ్వు గ్రేటయ్యా.. కోటి కొట్టేశావ్.. !
దగ్గుబాటి రామానాయుడు టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ .. ఆయన ఇద్దరు కుమారుల్లో ఒకరు వెంకటేష్ హీరోగా సెటిల్ అవ్వగా.. ఆయన అన్నయ్య దగ్గుబాటి సురేష్ టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా ఎదిగారు. ఇక సురేష్ కొడుకు రానా దగ్గుబాటి హీరోగా తెలుగు, తమిళ్ హిందీ భాషల్లో బాగా పాపులర్ అయిపోయాడు . వీళ్ళకి మించి వెంకటేష్ ఫ్యామిలీ గురించి కూడా వేరే బయట వాళ్ళకి తెలియదు . ముఖ్యం గా వెంకటేష్ భార్య గురించి అసలు చాలా మందికి తెలియదు .
వెంకటేష్ భార్య పేరు నీరజ. వెంకటేష్ పుట్టింది 13 డిసెంబరు 1960 కాగా వెంకటేష్ కి నీరజకి వివాహం 1985 లో జరిగింది. వెంకటేశ్ చౌదరి సామాజికవర్గానికి చెందిన వారు కాగా.. ఆయన భార్య నీరజ మాత్రం రెడ్డి సామాజికవర్గానికి చెందినది.. అయితే వెంకటేశ్ కు పెళ్లి చేయాలని భావించిన రామానాయుడు గారు కొడుకుని బాగా అర్థం చేసుకోగలిగిన ఒక మంచి అమ్మాయి కావాలని ప్రముఖ నిర్మాత అయిన విజయ నాగిరెడ్డిని అప్పట్లో అడిగారట.. అందుకు ఆయన మీ సామాజికవర్గంలో ఏమో కానీ మాకు సమీప బంధువుల్లో ఒక అమ్మాయి ఉంది. ఆమెకు ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారని నాగిరెడ్డి చెప్పాడట.. దీంతో రామానాయుడు గారు ‘నాకు అలాంటి పట్టింపు లేదు’ అని చెప్పడంతో తన బంధువు అయిన చిత్తూరు జిల్లా గంగవరపు సుబ్బారెడ్డి గారి కుమార్తె నీరజారెడ్డిని రామనాయుడికి చూపించారు. ఆయనతో పాటు వెంకటేశ్ కి కూడా ఆమె చూపించడం.. దాంతో నీరజ రెడ్డికి కూడా వెంకటేశ్ నచ్చడంతో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వెంకటేష్ కి 25 ఏళ్ల వయసులో నీరజతో పెళ్లి జరిగింది. ఇప్పుడు నీరజ వయస్సు 48 ఏళ్లు . వెంకటేష్ నీరజ లకి మొత్తం నలుగురు సంతానం. అందులో 3 అమ్మాయిలు ఒక్క అబ్బాయి. నీరజ వెంకటేష్ ల కూతుర్ల పేర్లు ఆశ్రిత, హయవాహినీ, భావన, కొడుకు అర్జున్ రాంనాథ్.. ఇంట్లో పిల్లలకి అవసరం అయ్యే ప్రతి పని నీరజ గారే దగ్గర ఉంది మరి చూసుకుంటారు .
Also Read: రష్మిక ఎవరినీ వదిలిపెట్టడం లేదుగా..!
నీరజ ఎంబీఏని అమెరికా లో చదివిన అనంతరం వెంకటేశ్ ను చేసుకొని హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యింది.. ఇక నీరజకు వ్యక్తిగతం బయట పార్టీలకు, ఇతర ఫంక్షన్లకు వెళ్లడం బొత్తిగా నచ్చదట.. ఆమె చాలా సెన్సిటివ్ అని.. బయటకు ఎక్కడి వెళ్లదని చెప్తుంటారు. వెంకటేశ్ ఎంత రమ్మని అన్నా కూడా సినిమా ప్రపంచానికి దూరంగా ఉంటుందట.. అలాగే తన పిల్లలను కూడా పెంచుతుందట.. అందుకే ఎవరికీ కనిపించకుండా ఆమె తన సంసార జీవితంలో వెంకటేశ్ తో కలిసి హ్యాపీగా జీవిస్తోందట..