కొత్తగా ఆలోచించడంలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటారు. సినిమాల ద్వారా ప్రయోగాలు చేసే అవకాశం వస్తే అస్సలు ఒదులుకోరు ఆయన. ఆ అలవాటుతోనే ఆగిపోయిన తన ‘నర్తనశాల’ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నారు. బాలయ్యకు ‘నర్తనశాల’ చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్. 16 ఏళ్ల క్రితం స్వీయ దర్శకత్వంలో రూపొందించాలని మొదలుపెట్టారు. కానీ కొంత షూటింగ్ జరిగాక ద్రౌపది పాత్ర చేస్తున్న స్టార్ నటి సౌందర్య విమాన ప్రమాదంలో మరణించడంతో అది ఆగిపోయింది. సౌందర్యను భర్తీ చేయగల నటి దొరక్కపోవడంతో బాలయ్య పూర్తిగా ఆ సినిమాను పక్కన పెట్టేశారు.
Also Read: ట్రైలర్ టాక్: కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’గా ఎలా మారిందంటే?
అయితే రానున్న దసరా పండుగకు అభిమానులకు ఏదో ఒక ట్రీట్ ఇవ్వాలనుకున్న ఆయన ‘నర్తనశాల’ కోసం షూట్ చేసిన ఫుటేజీని ఎడిట్ చేసి 17 నిముషాలకు కుదించి శ్రేయాస్ ఓటీటీ ద్వారా విడుదలచేయాలని పూనుకున్నారు. ఈ 17 నిముషాల చిన్న సినిమా కోసం బుల్లి ట్రైలర్ ఒకదాన్ని రెడీ చేసి వదిలారు. దానికి మంచి స్పందనే వచ్చింది. అయితే ఓటీటీలో ఈ చిన్న సినిమాను చూడాలంటే 50 రూపాయలు పెట్టి టికెట్ కొనాల్సి ఉంది. ఈ చిన్న మొత్తం ఆయన అభిమానులకు పెద్ద కష్టం అనిపించలేదు.
Also Read: బన్నీ పిల్లల ‘ఫ్రైడే నైట్ డ్యాన్స్ పార్టీ’ వైరల్..!
పైగా కాలం చేసిన సౌందర్య, శ్రీహరిలను మళ్ళీ మళ్ళీ కొత్తగా వెండితెర మీద చూసే అవకాశం రాదు కాబట్టి ప్రేక్షకులు సైతం సినిమాపై ఆసక్తి చూపారు. అందుకే లక్ష ఓటీటీ టికెట్లు బుక్ అయ్యాయట. అంటే ఇప్పటికిప్పుడు చూసుకున్నా 17 నిముషాల ‘నర్తనశాల’ 50 లక్షల రూపాయాలను సంపాదించినట్టే. ఇది నిన్నటి వరకు లెక్క. విడుదల ఈరోజు కాబట్టి ఇంకో లక్ష లేదా అంతకన్నా ఎక్కువ టికెట్లు అమ్ముడై ఉండవచ్చు. సో.. బాలయ్య ‘నర్తనశాల’ కలెక్షన్లు కోటి రూపాయల పైమాటే. మొత్తానికి బాలయ్య చేసిన వినూత్న ప్రయోగం బాగానే క్లిక్ అయిందన్నమాట.