
Rashmika Mandanna: క్రేజీ బ్యూటీ ‘రష్మిక మండన్నా’ ప్రస్తుతం హిందీ సినిమాలతోనే ఫుల్ బిజీగా ఉంది. రష్మిక చేస్తున్న సినిమాలో క్రేజీ మూవీ ‘గుడ్ బై’. ఈ చిత్రంలో లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే, రష్మిక నటన చూసి అమితాబ్ చాలా ముచ్చట పడుతున్నాడట. అందుకే, రష్మిక పాత్రను పెంచమని అమితాబ్ దర్శకనిర్మాతలతో చెప్పాడట. దాంతో ఆమె పాత్రను పెంచారు. నిజానికి ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది.
ఇప్పుడు పెంచిన సీన్స్ కారణంగా మళ్ళీ షూట్ చేయనున్నారు. అయితే, ఇప్పుడు చేయబోతున్న షూట్ సినిమాలో సీన్స్ కాదు అని, సినిమా ప్రమోషన్స్ కోసం చేస్తున్నారని.. ఈ షూట్ లో రష్మిక(Rashmika Mandanna)తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా కనిపించనున్నాడని తెలుస్తోంది. మొత్తానికి రష్మిక తన టాలెంట్ తో అమితాబ్ ను కూడా బాగా ఆకట్టుకుంది.
అన్నట్టు ఈ సినిమాలో రష్మికది సైడ్ క్యారెక్టర్ కాదు. ఏకంగా అమితాబ్ తో సమానంగా ఉండే క్యారెక్టర్ ఆమెది. మరి భారీ అంచనాలతో రాబోతున్న ఈ చిత్రం హిట్ అయితే, రష్మిక కెరీర్ బాలీవుడ్ లో సెట్ అయినట్టే . పైగా అమితాబ్ తో ఆమెకు మంచి సాన్నిహిత్యం కూడా ఏర్పడిందట. ఆ మధ్య రష్మిక కోసం అమితాబ్ ఓ ప్రత్యేక గిఫ్ట్ కూడా పట్టుకొచ్చి ఇచ్చాడు.
ఇంతకీ అమితాబ్ ఆమెకు ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా.. మేకప్ కిట్టు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అమితాబ్ తో రష్మిక ప్రేమలో పడుతుందని, తాత వయసులో ఉన్న వ్యక్తితో ప్రేమ ఏమిటి ? అసలు ఆమె ఎందుకు అమితాబ్ ను ఇష్టపడింది అనే కోణంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. మొత్తానికి కథ ఏదైనా.. ఎండింగ్ మాత్రం అమితాబ్ పాత్ర చనిపోతుందని, సినిమా ముగింపు వెరీ ఎమోషనల్ గా ఉంటుందని టాక్ నడుస్తోంది.
Also Read: అప్పుడు ‘సమంత’.. ఇప్పుడు ‘రష్మిక’