Rashmika : రష్మిక మందాన కెరీర్ పీక్స్ లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. రష్మిక నటించిన గత నాలుగు చిత్రాల్లో మూడు ఇండస్ట్రీ హిట్స్. యానిమల్ మూవీలో రన్బీర్ కపూర్ కి జంటగా నటించింది రష్మిక. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ వరల్డ్ వైడ్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అనంతరం విడుదలైన పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్ వండర్ గా నిలిచింది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా కొల్లగొట్టింది.
చావా మూవీతో మరో భారీ హిట్ ఖాతాలో వేసుకుంది రష్మిక. చావా సైతం రూ. 800 కోట్లకు పైగా వసూలు చేసింది. సల్మాన్ ఖాన్ కి జంటగా నటించిన సికిందర్ మాత్రమే నిరాశపరిచింది. కుబేర, గర్ల్ ఫ్రెండ్, తామా అనే చిత్రాలలో రష్మిక నటిస్తుంది. స్టార్ హీరోయిన్ గా ఆమెకు తీరిక లేదు. కెరీర్ పీక్స్ లో ఉంది. అలాంటి స్టార్ లేడీ ఓ చిన్న హీరోకి సమయం కేటాయించడం చర్చకు దారి తీస్తుంది. ఆయన ఎవరో కాదు ఆనంద్ దేవరకొండ. ఆయన కొత్త చిత్రం ఓపెనింగ్ కార్యక్రమానికి రష్మిక హాజరు కానుందని టాలీవుడ్ టాక్.
Also Read : స్టార్ క్రికెటర్ కి ధీటైన సమాధానం ఇచ్చిన రష్మిక..శభాష్ అంటున్న నెటిజెన్స్!
కేవలం ఆనంద్ దేవరకొండ కోసమే రష్మిక తన విలువైన సమయాన్ని కేటాయించి, మూవీ ఓపెనింగ్ ఈవెంట్ కి హాజరు కానుందని సమాచారం. ఆనంద్ దేవరకొండ కోసం రష్మిక రావాల్సిన అవసరం ఏముంది అంటే..? పలు కారణాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ కుటుంబంతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్ వస్తే విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లేందుకు రష్మిక ఆసక్తి చూపుతారు. విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్ కి హాజరవుతుంది. పండగలు కూడా కలిసి జరుపుకుంటుంది.
ఆమె అంతగా విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి పోవడానికి కారణం, ఆయనతో ప్రేమలో పడటమే, అనే వాదన ఉంది. విజయ్ దేవరకొండ-రష్మిక అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఇద్దరూ పలుమార్లు విదేశీ టూర్స్ కి వెళ్లారు. ఒకే హోటల్ గదిలో ఉన్నారని కూడా ఆధారాలు దొరికాయి. విజయ్ దేవరకొండ-రష్మిక రిలేషన్ లో ఉన్నారని చాలా సార్లు కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై స్పష్టమైన సమాధానం ఈ జంట ఎప్పుడూ ఇవ్వలేదు. విజయ్ దేవరకొండతో ఉన్న అనుబంధం వలనే ఆనంద్ దేవరకొండను రష్మిక సపోర్ట్ చేస్తుంది. గతంలో కూడా ఆనంద్ దేవరకొండ సినిమా ఈవెంట్స్ కి రష్మిక గెస్ట్ గా హాజరైందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
Also Read : విజయ్ దేవరకొండతో రష్మిక.. నిజమే అంటూ క్లారిటీ ఇచ్చిన శ్రీవల్లి!