Rashmika Mandanna: పెహల్గామ్(Pahalgam) లో జరిగిన ఉగ్రదాడులపై, ఆ తర్వాత జరిగిన ‘ఆపరేషన్ సింధూర్'(#OperationSindhoor) పై పలువురు సెలబ్రిటీలు స్పందించలేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ వాళ్ళని ట్యాగ్ చేసి తెగ రచ్చ చేస్తుంటారు. కానీ వాళ్ళ స్పందన విన్న తర్వాత వీళ్ళు ఏమి స్పందించకుండా ఉంటేనే బాగుంటుంది రా బాబు అని అనిపిస్తుంది. నిన్న ట్విట్టర్ లో ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) వేసిన ఒక ట్వీట్ పెను దుమారమే రేపింది. ఆయన ‘ఆపరేషన్ సింధూర్’ ని ఉద్దేశిస్తూ ‘ఒకరు కన్ను పీకేశారు కదా అని, మనం కూడా అవతలి వాళ్ళ కన్ను పీకుతూ వెళ్తే, ఈ ప్రపంచం మొత్తం గుడ్డిది అవుతుంది’ అంటూ ఆయన ఒక కామెంట్ చేశాడు. దీనిపై నెటిజెన్స్ అంబటి రాయుడు ని ఒక రేంజ్ లో ఏకిపారేశారు. అసలు నువ్వు మనిషివేనా అంటూ ఆయన్ని అభిమానించే వాళ్ళు కూడా పెదవి విరిచారు.
Also Read: మీ వల్లే మేమిలా.. సైన్యానికి విరాట్ కోహ్లీ హాట్సాఫ్!
అయితే అదే సమయంలో ప్రముఖ హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna) చేసిన కొన్ని కామెంట్స్ అంబటి రాయుడు చేసిన కామెంట్స్ కి కౌంటర్ లాగా అనిపించింది. ఆమె మాట్లాడుతూ ‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమని తాము రక్షించుకోవడాన్ని కొంతమంది యుద్దదాహం తీర్చుకునే దేశంగా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా తప్పు. అమాయకుల ప్రాణాలను తీసిన ఉగ్రవాదులను తుదముట్టించే చర్యలకు మద్దతు తెలుపుతున్న వారు హింసని ప్రోత్సహిస్తున్నట్టు కాదు, న్యాయానికి అండగా నిలబడినట్టు దాని అర్థం. ప్రతీ కారం తీర్చుకుంటున్న మన దేశాన్ని ప్రశ్నించడం కాదు, సరిహద్దులను దాటి మాన మృగాలుగా వ్యవహరించిన వారిని ప్రశ్నించండి. ఇంతమంది ప్రాణాలను బలిగొన్న దుర్మాగపు చర్యకు ప్రతీకారాన్ని తీర్చుకోవడం ఏ విధంగా తప్పు అవుతుంది?, శాంతిని కోరుకోవడం లో ఎలాంటి తప్పు లేదు, కానీ మనకు హాని తలపెట్టాలని చూసినప్పుడు కూడా శాంతంగా ఉంటే కచ్చితంగా మన చేతకాని తనం అవుతుంది’ అంటూ రష్మిక చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.
దీనిని ట్విట్టర్ లో నెటిజెన్స్ షేర్ చేస్తూ శభాష్ రష్మిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా అంబటి రాయుడు నిన్న రాత్రి వేసిన ట్వీట్ కి, రష్మిక మాట్లాడిన ఈ వ్యాఖ్యలను క్వాట్ చేస్తూ ‘చూసి బుద్ధి తెచ్చుకో’ అంటూ నెటిజెన్స్ అంబటి రాయుడు ని ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. అయితే అంబటి రాయుడు గత ఏడాది జనసేన పార్టీ లో చేరి, ఎన్నికల ప్రచారం లో పవన్ కళ్యాణ్ తో కలిసి అనేక ప్రాంతాల్లో తిరిగిన సంగతి అందరికీ తెలిసిందే. మొన్ననే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ‘కొంతమంది సెలబ్రిటీలు పిచ్చి కుక్కలు లాగా ఏది పడితే అది వాడుతున్నారు. అలా వాగితే కఠిన చర్యలు తప్పవు జాగ్రత్త’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు అంబటి రాయుడు పై చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి.