Pushpa: స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప. ఈ సినిమా రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తొలి భాగాన్ని పుష్ప దిరైజ్ డిసెంబరు 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు ప్రేక్షకులకు సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి.
తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన మాస్ సాంగ్ ఏయ్ బిడ్డా ఇది నా అడ్డ పాట అప్డేట్ను విడుదల చేసింది చిత్రబృందం. నవంబరు 19న ఈ పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ పాట తనకెంతో ఫేరవేట్ అని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ పాట కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న రష్మిక.. అల్లు అర్జున్ పోస్ట్‌పై ఆసక్తికర కామెంట్ చేసింది.
🔥🔥 it’s going to be 🔥🔥🔥🔥.. god! I can’t wait! 🔥 https://t.co/iliOr4XePE
— Rashmika Mandanna (@iamRashmika) November 14, 2021
నిజంగా ఈ పాట సూపర్‌గా ఉంటుంది. ఈ పాట కోసం నేనైతే ఎదురు చూడలేకపోతున్నాను. అంటూ కామెంట్ చేసింది రష్మిక. ఇప్పటి వరకు విడుదలైన దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామి సామి పాటలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్లిపోతున్నాయి. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమాలోని పాటలు ఎంతో సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఆ మార్కును పుష్పలోనూ చూపిస్తున్నారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Rashmika comments on bunny favourate song
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com