Homeఎంటర్టైన్మెంట్Pushpa: పుష్పలో శ్రీవల్లి పాత్రకోసం రష్మికకు వేసిన మేకప్ చూస్తే షాక్​ అవ్వాల్సిందే!

Pushpa: పుష్పలో శ్రీవల్లి పాత్రకోసం రష్మికకు వేసిన మేకప్ చూస్తే షాక్​ అవ్వాల్సిందే!

Pushpa: తను తీసే సినిమాలో కథకు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో.. పాత్రల రూపకల్పనలోనూ అంతే శ్రద్ధ తీసుకుంటారు దర్శకుడు సుకుమార్​. ఆ పాత్రలకు ఎంచుకున్న వారిని సహజంగా చూపించే వారిలో సుకుమార్​ ముందుంటాడనడంలో ఎటువంటి సందేహం లేదు. రంగస్థం సినిమాలోని పాత్రలే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. కాగా, ప్రస్తుతం సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప.

do-you-know-how-much-makeup-used-for-rashmika-in-pushpa

ఇందులోనూ ఇదే పంథాలో వెళ్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్​లుక్​, పాటలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఈ సినిమా కోసం స్టైలిస్​ స్టార్​ అల్లు అర్జున్​ తన కెరీర్​లో ఎప్పుడూ కనిపించనంత మాస్​ లుక్​లో దర్శనమివ్వనున్నారు. పక్కా పల్లెటూరు మొరటోడిగా సుకుమార్​ బన్నీని తీర్చిదిద్దారు. ఇందులో హీరోయిన్​గా నటిస్తున్న రష్మికనూ డీగ్లామర్​ పాత్రలో చూపిస్తున్నారు సుకుమార్​. ఇప్పటికే రష్మిక పాత్రకు సంబంధించిన ఫస్ట్​లుక్​లో ఆ విషయం క్లియర్​గా తెలుస్తోంది.

rashmika pushpa

అయితే, పాలరాయిలా మెరిసిపోయే రష్మికను డీగ్లామర్​గా చూపించేందుకు ఎంత మేకప్​ వేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. తాజాగా, రష్మిక షూటింగ్​ స్పాట్​లో తన చేతి ఫొటో తీసి ఇన్​స్టాగ్రామ్​ స్టోరీస్​లో పోస్ట్ చేసింది. లంచ్​ సమయంలో చేతులు కడుక్కోకుండా.. కేవలం అరచేతి భాగం మాత్రమే మేకప్​ లేకుండా కనిపించింది.

అరచేతిపైన మొత్తం గోధుమ రంగులో మేకప్​ నిడిపోయింది. ఈ ఒక్క ఫొటోతో రష్మిక పాత్ర విషయంలో సుకుమార్​ ఎంత శ్రద్ధ వహిస్తున్నారో అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్​గా మారింది. పుష్ప చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. ఇన్ని అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా థియేటర్స్​లో ఎలాంటి వండర్స్ సృష్టిస్తుందో తెలియాలంటే విడుదల వరకు ఎదురు చూడాల్సిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular