https://oktelugu.com/

బాలీవుడ్ హీరోయిన్ పై రష్మీ గౌతమ్ ఫైర్

హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కు కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రష్మీ గౌతమ్ కు సినిమాల్లో కంటే జబర్దస్ షో ద్వారానే ఎక్కువ ప్లాపులారిటీ వచ్చిన సంగతి తెల్సిందే. ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది. నిత్యం సమాజంలో జరిగే విషయాలపై సోషల్ మీడియాలో స్పందిస్తుంది. ఒక్కొసారి ఆమె పెట్టే పోస్టులతో నెటిజన్ల కొపానికి గురవుతుంటుంది. అయినప్పటికీ ఆమె చెప్పదలుచుకున్న విషయాలను నిర్మోహమాటంగా చెబుతోంది. తాజాగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 12, 2020 / 07:24 PM IST
    Follow us on


    హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కు కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రష్మీ గౌతమ్ కు సినిమాల్లో కంటే జబర్దస్ షో ద్వారానే ఎక్కువ ప్లాపులారిటీ వచ్చిన సంగతి తెల్సిందే. ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది. నిత్యం సమాజంలో జరిగే విషయాలపై సోషల్ మీడియాలో స్పందిస్తుంది. ఒక్కొసారి ఆమె పెట్టే పోస్టులతో నెటిజన్ల కొపానికి గురవుతుంటుంది. అయినప్పటికీ ఆమె చెప్పదలుచుకున్న విషయాలను నిర్మోహమాటంగా చెబుతోంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పై రష్మిక చేసిన హాట్ కామెంట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

    కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ లు బంద్ కావడంతో సెలబ్రెటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనాతో కలిసొచ్చిన సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా వినియోగించుకుంటున్నారు. కొందరు హీరోయిన్లు తమ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తున్నారు. మరికొందరు ఇంట్లో ఫ్యామిలీతో గడిపిన పిక్స్ షేర్ చేస్తున్నారు. కొందరు వంటలు నేర్చుకుంటుండా మరికొందరు యోగా, ఫిట్ నెస్ వంటి పనులతో కాలాన్ని గడుపుతున్నాయి. తాజాగా సోనమ్ కపూర్ కూడా తాను చాక్ లెట్ కేక్ తయారుచేసినట్లు సోషల్ మీడియాలో పెట్టింది. అయితే తాను చాక్ లెట్ కేక్ తయారు చేసేందుకు ఇంట్లో చాకె లెట్లు లేవని చెప్పింది. దీంతో ఫార్చ్యున్ గార్మెట్స్ సంస్థను చాక్ లెట్స్ కావాలని కోరగా వెంటనే వారు పంపించారని చెప్పుకొచ్చింది. ఈ విషయంలోనే సోనమ్ కపూర్ ను రష్మి గౌతమ్ తప్పుపట్టింది.

    కరోనా విజృంభిస్తున్న సమయంలో మీ హోదా ఉపయోగించి బయటి నుంచి చాక్ లెట్ తెప్పించుకోవడం ఏంటని ప్రశ్నించింది. ఇలాంటి సమయంలో ఇలా చేయడం కరెక్ట్ కాదని సోనమ్ పై అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో ఇవన్నీ అవసరమా? అంటూ నిలదీసింది. కాగా రష్మి గౌతమ్ కరోనా సమయంలో తనకు తోసిన విధంగా మూగజీవులకు ఆహారం పెడుతూ సేవ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో అందరూ ఆమె చేసిన అభినందించిన విషయం తెల్సిందే. అయితే సోనమ్ కపూర్ చేసిన పనికి ఈ భామ ఇంతలా రియాక్ట్ కావడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.