Rashi Khanna: 2019 రాశి ఖన్నా కెరీర్ లో బెస్ట్ ఇయర్. ఆమెకు ఆ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ దక్కాయి. రోజుల వ్యవధిలో విడుదలైన వెంకీ మామ, ప్రతిరోజూ పండగే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఆ దెబ్బతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హోదా దక్కడం ఖాయం అనుకున్నారు అందరూ. అయితే వరల్డ్ ఫేమస్ లవర్ మూవీతో మళ్ళీ ఆమె కెరీర్ వెనక్కి పోయింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రంలో రాశి ఖన్నా మెయిన్ హీరోయిన్ గా చేశారు. కెరీర్ లో మొదటిసారి బెడ్ రూమ్ సన్నివేశాలు, టైట్ లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు.
అయితే ఆమె కష్టం బూడిదలో పోసిన కన్నీరైంది. వరల్డ్ ఫేమస్ లవర్ ప్లాప్ కావడంతో పాటు ఆమె చేసిన బోల్డ్ రోల్ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపాయి. తెలుగులో కొన్నాళ్ళు ఆమెకు ఆఫర్స్ దక్కలేదు. దీంతో కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యారు. తుగ్లక్ దర్బార్, ఆర్నామలై 3 వంటి తమిళ చిత్రాల్లో నటించారు. ఆ చిత్రాలు రాశికి పెద్దగా గుర్తింపు తేలేకపోయాయి. తెలుగులో దారులు మూసుకుపోయాయని అనుకుంటున్న తరుణంలో మరో రెండు క్రేజీ ఆఫర్స్ వచ్చిపడ్డాయి.
Also Read: Mahesh Babu Favorite Food: మహేష్ బాబు ఇంత అందంగా ఉండడానికి ఏం తింటాడో తెలుసా?
రాశికి ప్రతిరోజూ పండగే వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు మారుతి పక్కా కమర్షియల్ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. హీరో గోపీచంద్ నటించిన ఈ మూవీ జులై 1న విడుదల కానుంది. అలాగే విక్రమ్ కె కుమార్, నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న థాంక్ యూ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం సైతం విడుదలకు సిద్ధం అవుతోంది. పక్కా కమర్షియల్, థాంక్ యూ చిత్రాల్లో ఒకటి విజయం సాధించినా రాశి కెరీర్ కి ప్లస్ అవుతుంది. టాలీవుడ్ లో మరలా మైలేజ్ దక్కుతుంది.
అయితే రాశి చేతిలో ఓ బాలీవుడ్ మూవీ కూడా ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా యోధ టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతుంది. యోధ చిత్ర హీరోయిన్ రాశి కావడం విశేషం. ప్రస్తుతం రాశి కెరీర్ అలా యావరేజ్ గా ఉంది. కాగా రాశి ఖన్నా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. బ్లాక్ ట్రెండీ అవుట్ ఫిట్ ధరించిన రాశి క్లీవేజ్ అందాలతో సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది. ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారగా.. ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.