Salman Khan: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో విపరీతమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒక్కరు సల్మాన్ ఖాన్..బాలీవుడ్ లో ఆయన సినిమా వచ్చిందంటే చాలు టాక్ తో సంబంధం లేకుండా కాసుల కనకవర్షం కురవాల్సిందే..అలాంటి క్రేజ్ ఉన్న ఈ స్టార్ హీరో కి ఇప్పుడు చంపేస్తాము అంటూ కొంత మంది దుండగులు నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం సెన్సషనల్ హాట్ టాపిక్ గా మారింది..సిద్ధూ మూసేవాలా అనే వ్యక్తిని ఎలా అయితే చంపామో..అలాగే నిన్ను కూడా చంపేస్తాము కాసుకో అని సల్మాన్ ఖాన్ కి కొన్ని బెదిరింపు లేఖలు వచ్చాయి..సల్మాన్ ఖాన్ మరియు అతని తండ్రి సలీం ఖాన్ ఇద్దరినీ కూడా చెంపేస్తాము అంటూ బెదిరింపు లేఖలు వస్తున్న నేపథ్యం లో అప్రమత్తం అయిన సల్మాన్ ఖాన్ వెంటనే బాంద్రా పోలీసులకు ఫిర్యాదు నమోదు చేసాడు..సల్మాన్ ఖాన్ ఫిర్యాదు చేసిన తర్వాత దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసుల విచారణ నుండి బయటపడిన విషయాలు ఏమిటి అంటే ఈ బెదిరింపులు అన్ని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనే వ్యక్తి చేసాడు అని తెలుస్తుంది..ఇతను 2018 వ సంవత్సరం లో కూడా సల్మాన్ ఖాన్ ని ఇలాగే బెదిరింపులు చేసాడు.

Also Read: Balakrishna- Sridevi: శ్రీదేవితో బాలయ్య ఎందుకు జతకట్టలేదు.. సీనియర్ ఎన్టీఆర్ మాట తీసుకున్నాడా?
సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు వచ్చినప్పటి నుండి ఆయనకీ సెక్యూరిటీ ని భారీ గా పెంచేశారు ..ముంబై లో ఉంటే కచ్చితంగా ప్రమాదకరం అని ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ రావడం తో సల్మాన్ ఖాన్ ని హైదరాబాద్ కి తరలించారు..ప్రస్తుతం ఆయన ‘కభీ ఈద్ కభీ దివాళీ’ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా కి సంబంధించిన ఒక్క భారీ షెడ్యూల్ ముంబై లో జరగాల్సి ఉంది..కానీ ముంబై లో సల్మాన్ ఖాన్ ఉండడం సేఫ్ కాదు అని రిపోర్ట్స్ రావడం తో..ముంబై లో జరగాల్సిన భారీ షెడ్యూల్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ కి మార్చారు..దాదాపుగా నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ ఇక్కడ జరగనుంది..ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా..ఆమె అన్నయ్యగా మన టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నాడు..ఒకపక్క చంపేస్తాము అని సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు వస్తున్నా కూడా ఆయన వాటిని ఏ మాత్రం లెక్క చెయ్యకుండా షూటింగ్స్ లో చురుగ్గా పాల్గొనడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం..ఏ క్షణంలో ఏ వైపు నుండి సల్మాన్ ఖాన్ పై దాడి జరుగుతుందో అని ఆయన అభిమానులు టెన్షన్ పడుతూ ఉన్నారు..వాళ్ళు అలా టెన్షన్ పడడానికి కూడా కారణం లేకపోలేదు..ఎందుకంటే సల్మాన్ ఖాన్ ని చంపడానికి ఏర్పాట్లు చేస్తున్న ఒక్క వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది..ఇది చూసినప్పటి నుండే సల్మాన్ ఖాన్ కి భారీగా సెక్యూరిటీ ని పెంచారు..మరి సల్మాన్ ఖాన్ ఈ దుండగుల నుండి ఎలా తప్పించుకుంటాడో చూడాలి.


