https://oktelugu.com/

ఓటీటీ బాటలో రవితేజ ‘క్రాక్‌’?

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా స్వయం కృషితో, తన టాలెంట్‌తో టాలీవుడ్‌లో అగ్ర నటుడిగా ఎదిగిన హీరో రవితేజ. వయసైపోతున్నా యూత్‌లో ఇప్పటికీ అతనికి ఫుల్ ‌ఫాలోయింగ్‌ ఉంది. మాస్‌ క్యారెక్టర్స్‌లో తన మార్కు కామెడీ టైమింగ్‌ను యాడ్‌ చేసే రవితేజ నటనకు ఫిదా అవ్వని వాళ్లు లేరు. కానీ, కొన్నాళ్లుగా అతను బ్యాడ్‌ ప్యాచ్‌లో ఉన్నాడు. వరుస పెట్టి సినిమాలు తీస్తున్నా సరైన హిట్స్‌ రావడం లేదు. పరాజయాలు వస్తున్నాయని మాస్‌ మహారాజా ఏ మాత్రం వెనక్కు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 13, 2020 / 09:34 PM IST
    Follow us on


    ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా స్వయం కృషితో, తన టాలెంట్‌తో టాలీవుడ్‌లో అగ్ర నటుడిగా ఎదిగిన హీరో రవితేజ. వయసైపోతున్నా యూత్‌లో ఇప్పటికీ అతనికి ఫుల్ ‌ఫాలోయింగ్‌ ఉంది. మాస్‌ క్యారెక్టర్స్‌లో తన మార్కు కామెడీ టైమింగ్‌ను యాడ్‌ చేసే రవితేజ నటనకు ఫిదా అవ్వని వాళ్లు లేరు. కానీ, కొన్నాళ్లుగా అతను బ్యాడ్‌ ప్యాచ్‌లో ఉన్నాడు. వరుస పెట్టి సినిమాలు తీస్తున్నా సరైన హిట్స్‌ రావడం లేదు. పరాజయాలు వస్తున్నాయని మాస్‌ మహారాజా ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాడు. గోపీచంద్ మ‌లినేని డైరెక్షన్‌లో రవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘క్రాక్‌’. షూటింగ్‌ కంప్లీట్‌ అయింది. కరోనా ప్రభావం లేకపోయి ఉంటే ఈ పాటికి రిలీజయ్యేది. షెడ్యూల్‌ ప్రకారం ఈ సమ్మర్లో విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ, థియేటర్లు మూత పడడంతో ఆ అవకాశం లేకుండా పోయింది.

    వయసైన రవితేజం.. కొత్త సినిమాల యవ్వారం !

    ఇప్పట్లో థియేటర్లు ఓపెనయ్యే పరిస్థితి లేకపోవడం.. ఇప్పటికే పలువురు నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో తమ సినిమాలు రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ‘క్రాక్‌’ చిత్ర బృందం కూడా ఆలోచనలో పడింది. ఈ మూవీని ఓటీటీలో రిలీజ్‌ చేస్తే ఎలా ఉంటుందని భావిస్తున్నారట. థియేటర్లో విడుదల చేసే పరిస్థితులు ఏర్పడేందుకు ఎంత సమయం పడుతుందో తెలియడం లేదు. ఫస్ట్‌ ప్రింట్‌ ఎక్కువ కాలం ల్యాబ్‌లో ఉండడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండబోదు. అందువల్ల మంచి ఆఫర్ వస్తే ఓటీటీలోనే రిలీజ్‌ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. రవితేజ స్టార్డమ్‌ దృష్ట్యా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌‘క్రాక్‌’కు మంచి రేటే పెట్టాల్సి ఉంటుంది. పైగా, డాన్‌ శీను, బ‌లుపు చిత్రాల త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న హ్యాట్రిక్ మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. రవి సరసన శ్రు తిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ భవితవ్యం త్వరలోనే తెలిసేపోయే అవకాశం ఉంది.