అతిగా శానిటైజర్ వాడితే అనర్థమేనంటా..!

కరోనా కాలంలో మనుషులంతా భౌతిక దూరం పాటించడం.. మాస్కులు ధరించడం..శానిటైజర్లు వాడటం కామన్ అయిపోయింది. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. కరోనా దాటికి అగ్రదేశాలు సైతం చేతులేత్తేశాయి. కరోనా మరణాలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలంతా కరోనాపై అవగాహన పెంచుకున్నారు. దీనిలో భాగంగానే కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తున్నాయి. కరోనా టైంలో శానిటైజర్లు వాడకం ఎక్కువైంది. ఈ సమయంలోననే శానిటైజర్లు అతిగా వాడితే అనర్థాలు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. […]

Written By: Neelambaram, Updated On : July 13, 2020 9:40 pm
Follow us on


కరోనా కాలంలో మనుషులంతా భౌతిక దూరం పాటించడం.. మాస్కులు ధరించడం..శానిటైజర్లు వాడటం కామన్ అయిపోయింది. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. కరోనా దాటికి అగ్రదేశాలు సైతం చేతులేత్తేశాయి. కరోనా మరణాలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలంతా కరోనాపై అవగాహన పెంచుకున్నారు. దీనిలో భాగంగానే కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తున్నాయి. కరోనా టైంలో శానిటైజర్లు వాడకం ఎక్కువైంది. ఈ సమయంలోననే శానిటైజర్లు అతిగా వాడితే అనర్థాలు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

కరోనా కట్టడిలో జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం

ప్రపంచ ఆరోగ్య సంస్థ, వైద్యుల సూచనల మేరకు ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. ప్రతీఒక్కరు భౌతిక దూరం పాటించడం, ముఖానికి మాస్కులు ధరించడం.. చేతులను శుభ్రంగా ఉంచుకునేందుకు శానిటైజర్లను వాడుతున్నారు. ఏదైనా వస్తువులను తాకిన తర్వాత ప్రతీఒక్కరు శానిటైజర్లతో చేతులు కడుక్కోవడం వంటి పనులు చేస్తున్నారు. కరోనాను నాశనం చేయడానికి చాలామంది అదేపనిగా శానిటైజర్లు వాడుతున్నారు. వీటిని అతిగా వాడితే అనర్థాలు కలుగుతాయని తాజాగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శానిటైజర్లను అతిగా వాడేవారిలో ఆల్కహాల్ కడుపులోకి చేరి వికారం కలిగిస్తుందని తేలిందట. ఇంకా మన శరీరంలో మంచిచేసే బ్యాక్టిరియా సైతం బయటికి వెళుతుందని, చర్మం కూడా పొడిబారిపోతుందని తాజా అధ్యాయనంలో వెల్లడైంది. దీనికి శానిటైజర్లలోని ఆల్కహాలే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ రసాయనాలతో పనిచేసేవారు శానిటైజర్లు ఉపయోగించకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

రంగంలోకి కేటీఆర్.. కరోనా విమర్శలకు చెక్

కరోనా వైరస్ నాశనానికి శానిటైజర్లన వాడే బదులుగా ఇంట్లో ఉపయోగించే సబ్బు వినియోగిస్తే మంచిదనే నిపుణులు సూచిస్తున్నారు. సబ్బు నీటితో చేతులను శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. అదేవిధంగా మాస్కులను కూడా అదేపనిలో ధరించడం వల్ల శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందట. మాస్కులు బయటికి వెళ్లినపుడు మాత్రమే ఉపయోగించాలని ఇంట్లో ఉన్న సమయంలో వాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అతి అనేది ఎప్పుడు అనర్థదాయకమే కావున ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.