https://oktelugu.com/

Bollywood Hero: తెలుగు డైరెక్టర్ కి బాలీవుడ్ హీరో షాక్ ఇస్తే.. ఆ హీరోకి తమిళ్ స్టార్ డైరెక్టర్ పెద్ద షాక్ ఇచ్చాడు గా…

Bollywood Hero: తెలుగులో యంగ్ డైరెక్టర్స్ అయిన నాగ్ ఆశ్విన్, ప్రశాంత్ వర్మ, సుజీత్ లాంటి దర్శకులు తెలుగు సినిమా స్టాండర్డ్ ని అంతకంతకు పెంచుతూ వస్తున్నారు.ఇక ఇదే టీమ్ లో బాలీవుడ్ హీరోలు కూడా మన దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Written By: , Updated On : July 9, 2024 / 02:08 PM IST
Ranveer Singh Project Is On Hold by Shankar

Ranveer Singh Project Is On Hold by Shankar

Follow us on

Bollywood Hero: తెలుగు సినిమా దర్శకులు ఇప్పుడు కొత్త పంథా లో ముందుకు వెళ్తున్నారు. ఇంతకు ముందు మూస ధోరణి కథలను ఎంచుకొని భారీగా దెబ్బతిన్న దర్శకులు ఇప్పుడు మాత్రం కొత్త ఆలోచనలతో పాన్ ఇండియా వైడ్ కథలను రెడీ చేస్తున్నారు. ఇక సినిమాలను భారీ సక్సెస్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగులో యంగ్ డైరెక్టర్స్ అయిన నాగ్ ఆశ్విన్, ప్రశాంత్ వర్మ, సుజీత్ లాంటి దర్శకులు తెలుగు సినిమా స్టాండర్డ్ ని అంతకంతకు పెంచుతూ వస్తున్నారు.ఇక ఇదే టీమ్ లో బాలీవుడ్ హీరోలు కూడా మన దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక హనుమాన్ సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకున్న ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో బాలీవుడ్ స్టార్ హీరో అయిన రన్వీర్ సింగ్ నటించాలని అనుకున్నాడు. కానీ ఇద్దరి మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఈ సినిమా అనేది ఆగిపోయింది. రన్వీర్ సింగ్ ఈ సినిమా నుంచి తప్పకున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఇక దాంతో ప్రశాంత్ వర్మ కొంతవరకు అప్సెట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక రీసెంట్ గా ఆయన రణ్వీర్ సింగ్ ను ఉద్దేశించి సోషల్ మీడియా లో ఒక పోస్ట్ కూడా పెట్టాడు. ఇక ఇదిలా ఉంటే సౌత్ సినిమా దర్శకుడు అయిన శంకర్ డైరెక్షన్ లో రణ్వీర్ సింగ్ ‘అపరిచితుడు ‘ రీమేక్ చేయాలని అనుకున్నాడు. కానీ శంకర్ రన్వీర్ సింగ్ కి షాకిస్తూ ఆ సినిమాను పక్కన పెట్టేసినట్టుగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ఇప్పుడప్పుడే అపరిచితుడు రీమేక్ సినిమా ఉండబోదని స్ట్రైయిట్ సినిమాలు చేయడానికి తను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.

ఇక దాంతో రన్వీర్ సింగ్ చాలావరకు డిజప్పాయింట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఇది చూసిన చాలామంది తెలుగు సినిమా అభిమానులు అలాగే సౌత్ సినిమా ప్రేక్షకులు సైతం ప్రశాంత్ వర్మ కి రన్వీర్ సింగ్ షాక్ ఇస్తే, సౌత్ డైరెక్టర్ అయిన శంకర్ రన్వీర్ సింగ్ కి షాక్ ఇచ్చాడు. దెబ్బ అదుర్స్ కదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు…