https://oktelugu.com/

Shankar-NTR: శంకర్ తో సినిమాకి రెడీ అవుతున్న జూనియర్ ఎన్టీయార్… ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందా..?

Shankar-NTR: ప్రస్తుతం ఆయన భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన గేమ్ చేంజర్ మీదనే తన ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాని కూడా ఈ సంవత్సరం చివర్లో రిలీజ్ చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : July 9, 2024 / 02:02 PM IST

    Jr NTR Shankar

    Follow us on

    Shankar-NTR: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో దాదాపు 25 సంవత్సరాల నుంచి నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్న ఒకే ఒక దర్శకుడు శంకర్…ఈయన సినిమాల్లో వైవిధ్యమైన కథాంశం ఉండటమే కాకుండా ఆయన సినిమాలు ఒక విజువల్ వండర్ గా తెరకెక్కుతూ ఉంటాయి. అందువల్లే ఆయన సినిమాలు చూడడానికి ప్రతి ఒక్క అభిమాని కూడా చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటాడు.

    ఇక ప్రస్తుతం ఆయన భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన గేమ్ చేంజర్ మీదనే తన ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాని కూడా ఈ సంవత్సరం చివర్లో రిలీజ్ చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఆయన మరొక స్క్రిప్ట్ ను కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాడట. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో ఆ కథని చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

    మరి శంకర్ ఇప్పుడు వచ్చే ఈ రెండు సినిమాలతో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ అటు దేవర, ఇటు వార్ 2 రెండు సినిమాలను చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు షూటింగ్ ముగిస్తే ఆయన చేయడానికి చేతిలో మరొక సినిమా కూడా లేదు. కాబట్టి ఆయన శంకర్ డైరెక్షన్ లో సినిమా చేయాడమే సరైన ఆప్షన్ గా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పాన్ ఇండియా డైరెక్టర్లందరు కూడా తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. కాబట్టి ఎన్టీఆర్ తో సినిమా చేయాలంటే పాన్ ఇండియా డైరెక్టర్ కావాలి.

    ఇక ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుందని చెప్పిన అది ఎప్పుడు పట్టలెక్కుతుందో క్లారిటీ లేదు. కాబట్టి ఆయన ఇప్పుడున్న పరిస్థితిలో శంకర్ అయితేనే చాలా బెటర్ గా ఉంటుందని తన సన్నిహితులు కూడా ఎన్టీఆర్ తో చెబుతున్నారట. ఇక ఎన్టీఆర్ శంకర్ కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేదా అనేది తెలియాలంటే భారతీయుడు 2, గేమ్ చేంజర్ సినిమాల మీదనే ఆధారపడి ఉందని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…