https://oktelugu.com/

Ram Charan : కమలహాసన్ సినిమా రీమేక్ చేయబోతున్న రామ్ చరణ్.. ఆ సినిమా ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు…

Ram Charan ఇక మొత్తానికైతే రామ్ చరణ్ కూడా కమలహాసన్ సినిమాలను రీమేక్ చేయాలనుకుంటున్నాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నిజానికి రామ్ చరణ్ కి వాళ్ళ నాన్న చిరంజీవి అంటే చాలా అభిమానం. కానీ వాళ్ళ నాన్న కాకుండా ఇంకా ఏ హీరో అంటే ఇష్టం అనే ప్రశ్నకి మాత్రం ఆయన కమల్ హాసన్ పేరు చెప్తున్నాడు. ఎందుకంటే కమలహాసన్ నటనకి అభిమానులు కాని వారు ఎవరూ ఉండరు...

Written By:
  • NARESH
  • , Updated On : July 9, 2024 / 02:10 PM IST

    Ram Charan is going to remake Kamal Haasan's 'Vichitra Sodarulu'

    Follow us on

    Ram Charan : తమిళ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశం మొత్తంలో తన లాంటి నటుడు మరొకరు లేరు అనేంతలా తన హవా భావాలతో అందరిని మెప్పించే సత్తా ఉన్న నటుడు కమలహాసన్.. ప్రస్తుతం ఆయన భారతీయుడు 2 సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. అయితే ఇంతకుముందు ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమాలో ఆయన విలన్ గా నటించినప్పటికీ అందులో కేవలం ఒకటి రెండు సీన్లకు మాత్రమే పరిమితమయ్యాడు. ఇక కల్కి 2 లో ఆయన పాత్ర ఎక్కువ నిడివితో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఒకప్పుడు హీరోగా చేసిన సినిమాలన్నీ కూడా సాహసోపేతంతో కూడిన సినిమాలే కావడం విశేషం…ఆయన ఎప్పుడు కమర్షియల్ సినిమాలు చేయలేదు. ప్రయోగతమైన, కళాత్మకమైన సినిమాలకి పెద్ద పీట వేస్తూ వచ్చాడు. ఇక కమర్షియల్ టచ్ ఉన్న సినిమాలను తక్కువగా చేశాడు. ఇక అనవసరమైన ఫైట్లు, బిల్డప్పులు ఎలివేషన్లతో కూడిన సినిమాలైతే ఆయన అసలు చేయలేదు.

    ఇక ఈ క్రమంలో కమలహాసన్ ని అభిమానించని ప్రేక్షకులు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక రీసెంట్ గా ప్రభాస్ కమలహాసన్ గొప్పతనం గురించి తెలియజేస్తూ నేను ఆయన అభిమానాని అంటూ చాలా గర్వం గా చెప్పుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ కూడా కమలహాసన్ అభిమాని అని ఒక సందర్భంలో తెలియచేశాడు. ఇక అదే సందర్భంలో కమలహాసన్ సినిమాలను రీమేక్ చేయాల్సి వస్తే ఏ సినిమా చేస్తారు అని అడిగితే ఆయన ‘విచిత్ర సోదరులు ‘ సినిమాని చేస్తానని చెప్పడం విశేషం… అలాగే పుష్పక విమానం సినిమా కూడా తనకు ఫేవరెట్ మూవీ అని అందులో మైమ్ ద్వారా సినిమా మొత్తాన్ని నడిపించిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని తెలియజేశారు.

    ఇక మొత్తానికైతే రామ్ చరణ్ కూడా కమలహాసన్ సినిమాలను రీమేక్ చేయాలనుకుంటున్నాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నిజానికి రామ్ చరణ్ కి వాళ్ళ నాన్న చిరంజీవి అంటే చాలా అభిమానం. కానీ వాళ్ళ నాన్న కాకుండా ఇంకా ఏ హీరో అంటే ఇష్టం అనే ప్రశ్నకి మాత్రం ఆయన కమల్ హాసన్ పేరు చెప్తున్నాడు. ఎందుకంటే కమలహాసన్ నటనకి అభిమానులు కాని వారు ఎవరూ ఉండరు…