లెజెండరీ క్రికెటర్ రాక ఇప్పట్లో లేనట్లే !

లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కి మొదటి నుండి దక్కాల్సిన స్థాయిలో గౌరవం దక్కలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనకంటే ప్రతిభలో అనుభవంలో తక్కువ ఉన్న వ్యక్తులు కూడా ఇండియన్ క్రికెట్ లో కీలక పాత్రలు వెలగబెడుతుంటే.. కపిల్ దేవ్ లాంటి గ్రేట్ టీమ్ లీడర్ మాత్రం ఏమి కాకుండా మిగిలిపోయాడు. కనీసం ఆయన జీవితాన్ని వెండితెర పై అన్నా చూసుకుని సంతోష పడదామంటే.. ఆయన బయోపిక్ విడుదల పై గత కొన్ని రోజులుగా అనేక రూమర్స్ వస్తూ […]

Written By: admin, Updated On : August 6, 2020 8:10 pm
Follow us on


లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కి మొదటి నుండి దక్కాల్సిన స్థాయిలో గౌరవం దక్కలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనకంటే ప్రతిభలో అనుభవంలో తక్కువ ఉన్న వ్యక్తులు కూడా ఇండియన్ క్రికెట్ లో కీలక పాత్రలు వెలగబెడుతుంటే.. కపిల్ దేవ్ లాంటి గ్రేట్ టీమ్ లీడర్ మాత్రం ఏమి కాకుండా మిగిలిపోయాడు. కనీసం ఆయన జీవితాన్ని వెండితెర పై అన్నా చూసుకుని సంతోష పడదామంటే.. ఆయన బయోపిక్ విడుదల పై గత కొన్ని రోజులుగా అనేక రూమర్స్ వస్తూ మొత్తానికి ఇప్పట్లో రిలీజ్ లేదని తేల్చేశారు. బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని యావత్తు క్రికెట్ ప్రేమికులు క్లారిటీ కోసం సినిమా టీమ్ కి సోషల్ మీడియా ద్వారా ఎంత మొర పెట్టుకున్నా దర్శకనిర్మాతలు మాత్రం ఇప్పట్లో మా సినిమా ఉండదని.. డైరెక్ట్ థియేటర్లల్లోనే సినిమా రిలీజ్ అవుతుందని వివరంగా చెప్పుకొచ్చారు.

Also Read: ‘కలర్ ఫొటో’ క్రేజ్‌ మామూలుగా లేదుగా

అసలు ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. కరోనా మహమ్మారి రాకతో సినిమా రిలీజ్ ఆగింది. అయితే సినిమాని ఓటిటీలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ మొదట ఉన్నా.. పైగా ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ నుండి ఈ బయోపిక్ కి భారీ ఆఫర్ వచ్చినా.. మేకర్స్ మాత్రం ఓటీటీ వైపు తొంగి చూడలేదు. సినిమాలోని అద్భుతమైన ఫీల్ అండ్ 80 నాటి కాలం సంగతులను పరిస్థితులను ప్రేక్షకులు ఇంకా బాగా ఓన్ చేసుకోవాలంటే థియేటర్ ఫీల్ ఉండాలి. అందుకే కరోనా అనంతరం నేరుగా థియేటర్స్ లోనే తమ సినిమా రిలీజ్ అని మేకర్స్ తమకు వచ్చిన ఆఫర్స్ ను కూడా రిజెక్ట్ చేశారు. నిజానికి అమెజాన్ లో రిలీజ్ చేస్తే.. ప్రొడ్యూసర్లకు ఎలాంటి టెన్సన్స్ లేకుండా భారీ మొత్తంలో డబ్బులు వస్తాయి. అయినా వాళ్ళు డబ్బు కంటే కూడా సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయం.

Also Read: ఆ ఫ్లాప్‌ తెలుగు మూవీని హిందీలో 10 కోట్ల మంది చూసేశారు..

ఇక బయోపిక్ ల స్పెషల్ ప్రొడ్యూసర్ విష్ణు ఇందూరి నిర్మిస్తున్న ఈ బయోపిక్ తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా తెలుగులో విడుదల కానుంది. తెలుగు ప్రేక్షుకుల్లో కూడా ఈ బయోపిక్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ’83’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ బయోపిక్ లో 1983 నాటి ఇండియా వరల్డ్ కప్ ను గెలుచుకున్న క్రమాన్ని, అలాగే కపిల్ దేవ్ జీవితం గమనం, ఆయన సాధించిన విజయాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. అయితే కపిల్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కువగా ఆసక్తి చూపుతుంది.. కపిల్ ఎందుకు రిటైర్ తరువాత పెద్దగా తన ప్రభావాన్ని చూపలేకపోయాడు..? ఇండియా క్రికెట్ వ్యవస్థలో తనకంటూ ఏమి లేకుండా ఎందుకు మిగిలిపోయాడు ? అనే అంశాల కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నారు.