https://oktelugu.com/

జగన్ పై గురి పెట్టిన ఎంపీ రఘురామ..!

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన విమర్శలకు మరింత పదును పెట్టారు. ఇప్పుడు నేరుగా సిఎం జగన్ కు సూచనల పేరుతో విమర్శలు చేస్తున్నారు. రాజధాని ప్రాంత మహిళల ఉద్యమంపై సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారం విషయలో సిఎంకు ఘాటైన సూచనలు చేశారు. రాజధాని మహిళలు కరోనా నేపథ్యంలో రహదారి వెంబడి సామాజిక దూరం పాటిస్తూ తమ సమస్యపై స్పందించాలని నిరసన తెలుపుతుంటే సోషల్ మీడియాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోందరు ఆ మహిళలను కుక్కలతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 7, 2020 11:16 am
    Follow us on


    నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన విమర్శలకు మరింత పదును పెట్టారు. ఇప్పుడు నేరుగా సిఎం జగన్ కు సూచనల పేరుతో విమర్శలు చేస్తున్నారు. రాజధాని ప్రాంత మహిళల ఉద్యమంపై సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారం విషయలో సిఎంకు ఘాటైన సూచనలు చేశారు. రాజధాని మహిళలు కరోనా నేపథ్యంలో రహదారి వెంబడి సామాజిక దూరం పాటిస్తూ తమ సమస్యపై స్పందించాలని నిరసన తెలుపుతుంటే సోషల్ మీడియాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోందరు ఆ మహిళలను కుక్కలతో పోల్చడాన్ని తప్పుబట్టారు. ఆ కుక్కలే రేపు వేట కుక్కలై వెంటాడే రోజులు వస్తాయని గుర్తుపెట్టుకోవాలని సిఎంకు సూచించారు.

    Also Read: ఆంధ్రజ్యోతికి చాలెంజ్ చేసిన జగన్ సీఎంవో

    ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టులు పెట్టినా వృద్ధులు, మహిళలు అని చూడకుండా అరెస్టు చేసి వేదిస్తున్న పోలీసులు ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి గోపాలపురం నియోజకవర్గంలో గుడి కట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. గుడి నిర్మాణం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. హిందువుగా ఈ చర్యలు ఖండిస్తున్నాని స్పష్టం చేశారు. జగన్ క్రిస్టియన్ కాబట్టి చర్చి నిర్మించుకోవాలని సూచించారు.

    వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించిన నాటి నుంచి ఎంపీ తన విమర్శలు మరింత పదును పెట్టారు. కీలక అంశాలైన అమరావతి విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలో నోరు విప్పిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. అయినప్పటికీ వైసీపీ ఆయన విషయంలో ఎటువంటి చర్యలు తీసుకునే ధైర్యం చేయలేకపోతుంది.

    Also Read: మీ చావు మీరు చావండి.. ఏపీపై కేంద్రం నిర్ణయమిదే?

    పార్టీలోనే ఉండి ఇన్ని విషయాల్లో విమర్శలు చేస్తున్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని భావించి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పార్టీ తీసుకున్న అన్ని చర్యలు ఎంపీ రాఘురామ కృష్ణం రాజు విషయంలో విఫలమయ్యాయి. ఆ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులను పార్టీ ఉసి గొల్పినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది.

    ఇదిలా ఉండగా ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు పార్లమెంటులో సీటు మార్చి ఆయనపై పైచేయి సాధించినట్లుగా వైసీపీ భావిస్తుండగా, కేంద్ర హోం శాఖ నుంచి ‘వై’ కేటగిరి భద్రత పొంది ఏంపీ తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నారు. కేంద్ర హోం శాఖ బలగాలతో వై కేటగిరి భద్రత కల్పిస్తున్నట్టు హోం శాఖ రాష్ట్ర డిజిపికి కేంద్ర హోం శాఖ లేఖ రాసింది.