Homeఎంటర్టైన్మెంట్రష్మిక మైండ్ కరాబు చేస్తున్న హీరో

రష్మిక మైండ్ కరాబు చేస్తున్న హీరో


కన్నడ, తెలుగులో మంచి స్టార్డమ్‌ ఉన్న నటి రష్మిక మందాన్న. ఈ ఇయర్ సరిలేరు నీకెవ్వరూ, భీష్మ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌ పడడంతో ఈ అమ్మడు అదృష్టం మరింత పెరిగింది. లక్కీ హీరోయిన్‌ అనే ముద్ర పడడంతో స్టార్ హీరోలు, డైరెక్టర్లు ఆమె డేట్స్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. అటు కన్నడలో కూడా ఆమె క్రేజ్‌ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఎలాగూ తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉండడంతో రష్మిక కన్నడ మూవీస్‌ను తెలుగులో కూడా రిలీజ్‌ చేసి క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రష్మిక, ధ్రువ్‌ సర్జా జంటగా నటించిన కన్నడ ఫిల్మ్‌ ‘పొగరు’ను అదే టైటిల్‌తో తెలుగులో నేరుగా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ మూవీపై కన్నడలో విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. ఈ సినిమాలో కరాబు అనే వీడియో సాంగ్‌ ను ఏప్రిల్‌లో యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. దానికి ఏకంగా 100 మిలియన్ల వ్యూస్‌ లభించాయి. మంచి లిరిక్స్‌, దానికి తగ్గ మ్యూజిక్‌, ధ్రువ్‌ డ్యాన్స్‌ మూవ్స్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Also Read: ఆ ఫ్లాప్‌ తెలుగు మూవీని హిందీలో 10 కోట్ల మంది చూసేశారు..

ఈ సాంగ్‌ తెలుగు వెర్షన్‌ను ఈ రోజు (బుధవారం) యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. దానికి కూడా మంచి స్పందన వస్తోంది. హెవీ పర్సనాలిటీతో విలన్‌ మాదిరిగా కనిపిస్తున్న హీరో ధ్రువ్‌.. హీరోయిన్‌ రష్మికను టీజ్‌ చేస్తుండే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ఒరిజినల్‌ వెర్షన్‌ను సినిమా మ్యూజిక్‌ డైరెక్టర్ చందన్‌ శెట్టి రాశాడు. తెలుగులో భాస్కరబట్ల లిరిక్స్‌ అందించగా…. ‘రాములో రాములా’ ఫేమ్‌ అనురాగ్‌ కులకర్ణి అందంగా ఆలపించాడు. ‘కరాబు.. మైండు కరాబు.. మెరిసే మతాబు.. నిలబడి చూస్తావా రుబాబు’ అంటూ సాగే లిరిక్స్‌ క్యాచీగా ఉన్నాయి. ఆరు గంటల్లోనే రెండు మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. కాగా, ఈ మూవీని నంద కిషోర్ రూపొందిస్తున్నాడు. శాండిల్‌వుడ్‌లో రష్మికకు ఇది ఐదో చిత్రం. ఇందులో ఆమె ప్రొఫెసర్ పాత్ర పోషించింది. షూటింగ్‌ ఎప్పుడూ పూర్తయింది. మార్చిలోనే రిలీజ్‌ చేయాలని భావించినా.. కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడింది.

Pogaru | Karabuu | Telugu Video Song |Dhruva Sarja |Rashmika Mandanna |Nanda Kishore| Chandan Shetty

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version