Ranveer-Deepika Ready For Divorce: దీపికా పదుకొనె-రణ్వీర్ సింగ్ విడిపోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తిన నేపథ్యంలో విడాకులకు సిద్దమయ్యారని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు ట్వీట్ దీనికి ఆజ్యం పోసింది. ఇటీవల ఉమర్ సంధు.. దీపికా పదుకొనె-రణ్వీర్ సింగ్ మధ్య పరిస్థితులు దెబ్బతిన్నాయి. విబేధాలు తలెత్తాయి, అంటూ ట్వీట్ చేశాడు. ఆయన ఆ కామెంట్ చేయడానికి గట్టి ఆధారాలు ఉన్నాయా? లేదా? అనేది తెలియదు. ఉమర్ మాత్రం రణ్వీర్-దీపికా బంధం బలహీనపడిందని హింట్ ఇచ్చాడు.

ఆ ట్వీట్ ఆధారంగా బాలీవుడ్ మీడియాలో పలు కథనాలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో హీరో రణ్వీర్ సింగ్ క్లారిటీ ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో రణ్వీర్ మాట్లాడుతూ… దీపికాతో నా బంధం 2012లో మొదలైంది. ఇప్పుడు 2022, అంటే పదేళ్లుగా ఆమెతో నా ప్రయాణం సాగుతుంది. కాలం గడిచే కొద్ది ఆమెపై నాకు ఇంకా ప్రేమ, గౌరవం పెరుగుతూ పోతున్నాయి. జీవితంలో నాకు దొరికిన అదృష్ట దేవత దీపికా.. ఆమెతో నా బంధం ఎప్పటికీ కొనసాగుతుంది, అని చెప్పుకొచ్చారు.
దీపికాతో విడిపోతున్నట్లు, విడాకులు ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని. వారి బంధం చాలా స్ట్రాంగ్ గా ఉందని రణ్వీర్ కుండబద్దలు కొట్టారు. 2018లో దీపికా-రణ్వీర్ వివాహం జరిగింది. అప్పటి నుండి ఈ జంట చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. ఏనాడూ గొడవపడ్డ దాఖలాలు లేవు. మస్పర్దలు వచ్చాయంటూ ఎలాంటి న్యూస్ లేదు. సడన్ గా విడిపోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు రావడంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు.

కాగా ఈ మధ్య దీపికా ఆరోగ్యంపై కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. ఆమె మానసిక రుగ్మతతో బాధపడుతున్నారంటూ సదరు వార్తల సారాంశం. తరచుగా ఆమె ఆసుపత్రి పాలు కావడం కూడా ఈ వార్తలకు కారణం అవుతున్నాయి. ప్రాజెక్ట్ కే సెట్స్ లో దీపికా స్పృహతప్పి పడిపోయారు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి ఆమెను హుటాహుటిన తరలించాల్సి వచ్చింది. ఇటీవల కూడా ముంబై బ్రీచ్ కాండీ హాస్పిటల్ కి దీపికా వెళ్లారు. వరుస పరిణామాలు ఆమె ఆరోగ్యం పై వస్తున్న వార్తలు నిజమే అన్న సందేహాలు కలిగిస్తున్నాయి. ప్రాజెక్ట్ కె మూవీతో దీపికా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.