Rangabali Closing Collections: స్టార్ హీరో గా ఎదిగేందుకు అన్నీ రకాల అర్హతలు ఉన్నప్పటికీ సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేక కనీసం మీడియం హీరో రేంజ్ మార్కెట్ ని కూడా సంపాదించుకోలేక పోయిన నటుడు నాగ శౌర్య. ఇప్పటి వరకు ఆయన 28 సినిమాల్లో హీరో గా నటించగా, అందులో కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. మిగిలిన సినిమాలన్నీ కూడా ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళాయో అనేది ఎవరికీ తెలియదు.
అయ్యినప్పటికీ కూడా ఈయన అలుపెరుగని వీరుడి లాగ సినిమాలు చేస్తూనే ఉన్నాడు, పాపం ఇతని కష్టం చూస్తే ఎవరికైనా జాలి వెయ్యక తప్పదు. అయితే ఈసారి ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలనే కసితో ‘రంగబలి’ అనే చిత్రం చేసాడు. యూత్ కి ఎలాంటి ఐడియాస్ ద్వారా వెళ్తే రీచ్ అవుతారో, అలాంటి ఐడియాస్ అన్నీ వాడి, విన్నూతన రీతిలో ఈ సినిమాకి ప్రొమోషన్స్ చేసారు.
కానీ ప్రొమోషన్స్ లో చూపించినంత టేకింగ్ ప్రతిభ సినిమాలో డైరెక్టర్ చూపించకపోవడం వల్ల ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 6 కోట్ల 50 లక్షల రూపాయిలను జరగగా, క్లోసింగ్ లో ఇప్పటి వరకు 3 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
ఈ సినిమాకి ప్రొమోషన్స్ కోసం దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిలు ఖర్చు చేశారట. కనీసం ఆ ఖర్చులను కూడా రాబట్టలేకపోయింది. ఇది నిజంగా నాగ శౌర్య బ్యాడ్ లక్ అనే చెప్పాలి. వాస్తవానికి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ జనాలకు బాగా నచ్చింది. కానీ సెకండ్ హాఫ్ లో కథ డీవియేట్ అవ్వడం తో సినిమా పలుచ బడింది. దాంతో ఈ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చింది. థియేటర్స్ లో ఇంత పెద్ద ఫ్లాప్ అయిన ఈ సినిమా కనీసం ఓటీటీ ఆడియన్స్ ని అయినా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.