మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ‘ఖైదీ-150’తో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ తన సత్తాను మెగాస్టార్ చాటారు. రాంచరణ్ కొణిదల ప్రొడక్షన్ స్థాపించి ‘ఖైదీ-150’తో తొలిసారి నిర్మాతగా మారారు. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో రాంచరణ్ నిర్మాతగా సక్సస్ సాధించారు.
Also Read:‘ఆర్ఆర్ఆర్’ ఓవర్ బడ్జెట్ పై రాజమౌళి ప్లాన్ !
రాంచరణ్ హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘ఖైదీ-150’ తర్వాత భారీ బడ్జెట్లో ‘సైరా’ మూవీని నిర్మించారు. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయం సాధించినప్పటికీ భారీ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ప్రస్తుతం చిరంజీవితోనే ‘ఆచార్య’ మూవీని నిర్మిస్తున్నాడు.
కొరటాల శివ దర్శకత్వంతో ‘ఆచార్య’ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో మెగాస్టార్ తో కలిసి రాంచరణ్ స్ర్కీన్ షేర్ చేసుకోబోతున్నాడు. రాంచరణ్ నటించిన పలు సినిమాల్లో చిరంజీవి గెస్ట్ రోల్ చేసి అలరించాడు. ‘మగధీర’..‘బ్రూస్లీ’లో చిరంజీవి కన్పించాడు. ఇక చిరంజీవి నటించిన ‘ఖైదీ-150’లో రాంచరణ్ స్పెషల్ సాంగ్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు.
Also Read: షూటింగుకు రెడీ అవుతున్న సూపర్ స్టార్?
ప్రస్తుతం ‘ఆచార్య’లో కలిసి నటిస్తున్న తండ్రీకొడుకులు మరోసారి కలిసి నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. మలయాళంలో సూపర్ హిట్టుగా నిలిచి ‘లూసీఫర్’ను తెలుగులో దర్శకుడు వీవీ.వినాయక్ తెరక్కించబోతున్నారు. ఈ మూవీలో రాంచరణ్ ఓ స్పెషల్ రోల్ చేస్తాడనే టాక్ విన్పిస్తుంది. ఈమేరకు దర్శకుడు స్క్రీప్టులో కొన్ని మార్పులు చేశాడట. ఇదే నిజమైతే మాత్రం మెగా ఫ్యాన్స్ కు మరోసారి కన్నులపండుగే అనే కామెంట్లు విన్పిస్తున్నాయి. రాంచరణ్ తన తండ్రిని సినిమా విషయంలో ఎవరికీ విడిచిపెట్టకపోవడంతో అగ్ర నిర్మాతలు మాత్రం ఫీలవుతున్నారు.