Shabad case : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ప్రాంతంలో ఆరు హ*త్యలకు పాల్పడిన రాజ్ కుమార్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి బలవంతంగా తనువు చాలించాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంజర్ల ప్రాంతంలో అతని మృతదేహం లభించింది. పోలీసులకు సమాచారం రావడంతో క్షేత్రస్థాయికి వెళ్లారు. మృతదేహాన్ని పరిశీలించి.. అతడు రాజ్ కుమార్ అని నిర్ధారించారు.
రాజ్ కుమార్ చనిపోయిన తర్వాత.. అతడు సంబంధించిన వివరాలను సిపి తరుణ్ చూసి బయటపెట్టారు.. ఆరు హ*త్యలు చేయడాని కంటే ముందు రాజ్ కుమార్ వీడియోలు తీశాడు.. ఆ వీడియోలలో కీలక విషయాలు వెల్లడించాడు. ఈ హత్యలను చేయడానికి రాజ్ కుమార్ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాడు. అందువల్లే అతడు 15 రోజులపాటు నిశ్శబ్దంగా ఉన్నాడు. బెయిల్ వచ్చిన తర్వాత అతడు పెద్దగా ఎవరితో మాట్లాడలేదు. తన కుమారుడు రింగ్ మింగి ఇబ్బంది పడుతున్నప్పటికీ హాస్పిటల్ తీసుకెళ్లలేదు.
ఎప్పుడైతే తన ప్రణాళిక అమలు చేయాలని అనుకున్నాడో.. అప్పుడే రంగంలోకి దిగాడు. ఒక కత్తి కొనుగోలు చేశాడు. నేరుగా ఆ బాలిక ఇంటికి వెళ్ళాడు. ఆమెను బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో ఆమె తల్లి అడ్డగించింది. ఆమె నానమ్మ కూడా అడ్డుకోబోయింది. వారిద్దరినీ కత్తితో పొడిచి చంపిన రాజ్ కుమార్.. దివ్యాంగురాలు అయిన ఆ బాలిక సోదరిని వదిలిపెట్టాడు. ఆ బాలికను తన కారులో ఎక్కించుకొని.. చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను అక్కడ చంపేశాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తన భార్యను.. ఇద్దరి పిల్లల్ని చంపేశాడు.
జరిగిన దారుణాన్ని ఫోన్లో తన తండ్రికి చెప్పాడు. తను వాడుతున్న ఫోన్లు మొత్తం స్విచ్ ఆఫ్ చేశాడు. అనేక ప్రాంతాలు తిరిగాడు. చివరికి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడు. ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నాడు. పోలీసుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడం.. జీవితం మీద విరక్తి చెందడంతో పురుగుల మందు తాగి చనిపోయాడు. అయితే ఈ హత్యల పరంపరకు పాల్పడే ముందు రాజ్ కుమార్ వీడియో రికార్డ్ చేశాడు. “అతడి మృతదేహం వద్ద ఫోన్ దొరికింది. జూలై 10న సాయంత్రం నాలుగు గంటల 45 నిమిషాలకు వీడియో రికార్డ్ చేశాడు. నేను సంపాదించిన డబ్బులు సగం మొత్తం వాళ్లకే పెట్టాను. నా దగ్గర డబ్బులు వసూలు చేశారు. నన్ను నష్టపరిచారు. నా పిల్లలకు భూమి కూడా లేదు. అమ్మాయిని నమ్మి అప్పుల పాలయ్యాను. చివరికి కేసు పెట్టి జైలుకు పంపించారని ఆ వీడియోలో రాజ్ కుమార్ వెల్లడించాడని” సిపి తరుణ్ జోషి పేర్కొన్నారు. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.
