రైతుల గొంతు కోసే వ్యవసాయ బిల్లులపై రాజ్యసభ రణరంగమైంది. టీఎంసీ ఎంపీ అయితే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పోడియంపై దండెత్తాడు. ఇక సభ్యులు మైక్ లాగేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవసాయ బిల్లులకు మద్దతుగా విపక్ష సభ్యులు నినాదాలు చేసి పోడియం వద్దకు దూసుకొచ్చారు. వ్యవసాయ బిల్లుల ప్రతులను చించేసి డిప్యూటీ చైర్మన్ పైకి విసిరారు. ఆయన వద్ద మైకు లాగేందుకు ప్రయత్నించారు.దీంతో అతికష్టం మీద రాజ్యసభ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.
Also Read: రైతు బిల్లులకు వైసీపీ మద్దతు.. జగన్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?
ఇంతటి రణరంగం మధ్య బీజేపీ వ్యూహాత్మకంగా మూజువాణితో అనైతికంగా వ్యవసాయ బిల్లులకు ఆమోదం పొందించింది. దీనిపై విపక్ష సభ్యులు మండిపడ్డారు. ఓటింగ్ పెడితే ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా సొంత పక్షాలు సైతం ఓటు వేసే పరిస్థితులు వుండడంతో వ్యూహాత్మకంగా బీజేపీ సర్కార్ డిప్యూటీ చైర్మన్ ను రంగంలోకి దించి మూజువాణి ఓటుతో పని పూర్తి చేశారు.
ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, నినాదాల మధ్యే రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా విపక్షాలు ప్రవేశపెట్టిన సవరణ తీర్మానాలు వీగిపోయాయి. అనంతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. సభను రేపటికి వాయిదా వేశారు.
వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ఉద్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన ఈ వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించినట్టైంది. ఇప్పటికే 3 వ్యవసాయ బిల్లులకు లోక్ సభలో విశేష బలం ఉన్న బీజేపీ నెగ్గించుకుంది. ఇక రాజ్యసభలో విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్టు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు.
Also Read: ప్రధానితో భేటికి కేసీఆర్, జగన్.. ఏం జరుగుతోంది?
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రాజ్యసభ అట్టుడికింది. తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం మధ్యే బిల్లులను ఆమోదించుకున్నారు.. ప్రతిపక్షాల ఎంపీలు తీవ్ర నిరసన తెలిపాయి. పోడియం వద్ద గందరగోళం సృష్టించాయి. దీంతో మూజువాణి ఓటుతో బీజేపీ బిల్లులను బీజేపీ గట్టెక్కించుకుంది.
దేశవ్యాప్తంగా రైతులు, పార్టీలు, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న ఈ బిల్లుకు ఏపీలోని అధికార వైసీపీ మాత్రం మద్దతు తెలుపడం గమనార్హం. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవసాయ బిల్లులకు మద్దతు ప్రకటించారు. ఇక టీఆర్ఎస్ పార్టీ ఈ బిల్లులను వ్యతిరేకించింది.