Homeఎంటర్టైన్మెంట్Ranbir Kapoor- Alia Bhatt: అలియా బరువు పై వెనక్కి తగ్గిన రణబీర్.. పబ్లిక్ గా...

Ranbir Kapoor- Alia Bhatt: అలియా బరువు పై వెనక్కి తగ్గిన రణబీర్.. పబ్లిక్ గా క్షమాపణలు.. శాంతించిన నెటిజన్లు

Ranbir Kapoor- Alia Bhatt: రణబీర్ కపూర్ – ఆలియా భట్ ఏప్రిల్ 14న వివాహంతో ఒక్కటి అయ్యారు. త్వరలోనే వీరిద్దరూ తల్లిదండ్రులుగా మారనున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో వీరిద్దరూ తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా ఆలియా సోనోగ్రఫీ చేయించుకుంటున్న ఫోటోను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఈ వార్తను పంచుకున్న సంగతి తెలిసిందే. అయితే అలియా ప్రెగెన్సీ సమయంలో బాగా బరువు పెరిగింది. ఈ విషయం పై రణబీర్ కపూర్ ఫన్నీ గా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

Ranbir Kapoor- Alia Bhatt
Ranbir Kapoor- Alia Bhatt

అయితే, రణబీర్ కపూర్ తన బ్రహ్మాస్త్ర సినిమా ప్రచార కార్యక్రమాలలో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా బ్రహ్మాస్త్ర ప్రమోషన్ కోసం రణబీర్ బుధవారం చెన్నై వెళ్ళాడు. అక్కడ రణబీర్ అలియా బరువు పై చేసిన వ్యాఖ్య గురించి స్పందించాడు. రణబీర్ స్పందిస్తూ, “నా జీవితంలో నేను ఎక్కువగా నా భార్యను ప్రేమిస్తున్నాను. అయితే అలియా పై నేను తమాషాగా మాట్లాడిన జోక్ మాత్రమే అది. ఈ విషయంలో ఎవరినైనా ఫీల్ అయితే, నేను వారికి నిజంగా క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను’ అని రణబీర్ చెప్పాడు.

Also Read: Akhil- Ananya Panday: విజయ్ దేవరకొండ హీరోయిన్ తో అఖిల్ రొమాన్స్.. క్రేజీ అప్ డేట్.. షాక్ లో అక్కినేని ఫ్యాన్స్

ఇక ఈ జంట ప్రస్తుతం ‘వాస్తు’ అనే బంగ్లాలో కాపురం పెట్టారు. వచ్చే నెలలో రణబీర్ తన తాతయ్య రాజ్ కపూర్ కట్టించిన ‘కృష్ణ రాజ్’ అనే బంగ్లాకి తన కాపురం మార్చబోతున్నాడు. ‘కృష్ణ రాజ్’బంగ్లా మరమత్తులు పనులు పూర్తి కావడానికి మరో నెల పట్టేలా ఉంది. ఏది ఏమైనా బాలీవుడ్ లోనే క్రేజీ జంటగా ఈ జంటకు నేమ్ ఉంది. రణబీర్ కపూర్ ఒక్కో సినిమాకు 60 కోట్లు తీసుకుంటున్నాడు. అలియా ఒక్కో సినిమా 8 కోట్లు డిమాండ్ చేస్తోంది.

Ranbir Kapoor- Alia Bhatt
Ranbir Kapoor- Alia Bhatt

సంపాదన పరంగానే కాకుండా ఆస్తుల పరంగా లెక్కలు వేసుకున్నా ఈ జంటకి 800 కోట్లు నెట్ వర్త్ ఉంది. ఇక రణబీర్ తో ఐదేళ్ల పాటు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన అలియా.. ఇప్పుడు సంసార బంధంలో అంతకుమించి ప్రేమ ఉంటుందని చెబుతుంది. మొత్తానికి ఎన్నాళ్లో వేచిన ఉదయం ఇన్నేళ్లకు పూసింది. ఈ లవ్‌బర్డ్స్ అధికారికంగా ఒక్కటి అవ్వడంతో పాటు త్వరలోనే తల్లిదండ్రులుగా కూడా మారబోతున్నారు.

అన్నట్టు పెళ్లి తర్వాత ఇక అలియా భట్ సినిమాల్లో నటించదు అని ప్రచారం చేశారు. కానీ, పిల్లలు పుట్టాక కూడా నటిస్తాను అంటూ అలియా ఓపెన్ గా చెప్పేసింది. మొత్తానికి అలియా భట్ తిరిగి మూవీస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపించడంతో ఆమె ఫ్యాన్స్ అంతా సంబరపడిపోతున్నారు.

Also Read:Heroine Raasi: కష్టాల వలయంలో నలిగిపోతున్న హీరోయిన్ రాశి.. అసలేం జరిగింది ?.. ఆమె ఎందుకు రోడ్డున పడాల్సి వచ్చింది ?

 

పవన్ కళ్యాణ్ నాకు లైఫ్ ఇచ్చాడు || Sukumar Interview With Puri Jagannadh || Oktelugu Entertainment

 

Nagarjuna Heroine Poonam Bajwa Bikini Photos Goes Viral | Poonam Bajwa Latest Photos | Poonam Bajwa

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version