Employees Resigned: అమెరికా కేంద్రంగా ఐటీ, ఇతరత్రా వ్యాపారాలు నిర్వహించే కాగ్నిజెంట్ కంపెనీకి ఉద్యోగులు షాకిచ్చారు. 90 రోజుల్లో ఏకంగా 1.2 లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఉద్యోగుల రాజీనామా చేయడంతో గత జూన్ 30 తో ముగిసిన రెండో త్రైమాసికానికి ప్రస్తుతం ఉన్న మానవ వనరుల్లో 36% క్షీణత ఏర్పడిందని, సంస్థ చరిత్రలో ఇలాంటి విపత్తు ఇదే ప్రథమం అని కంపెనీ అధికారికంగా ప్రకటించడం విశేషం.

-ఎందుకు ఈ సమస్య
ఐటీ , బ్యాంకింగ్ , ఫార్మా, హెల్త్ సొల్యూషన్ వంటి రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాగ్నిజెంట్ కంపెనీ కి ప్రపంచ వ్యాప్తంగా 3,41,300 మంది ఉద్యోగులు ఉన్నారు. 18.5 బిలియన్ డాలర్ల సంపద ఉంది. ఫార్చ్యూన్ జాబితా -2022లో కంపెనీ 154వ స్థానంలో కొనసాగుతోంది. ఇంతటి చరిత్ర ఉన్న ఈ కంపెనీ ప్రస్తుతం ఉద్యోగుల రాజీనామాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఐటీ ఆధారంగా పనిచేసే ఏ కంపెనీకి అయినా మానవ వనరులే కీలకం. పైగా భిన్న రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న కాగ్నిజెంట్ లాంటి కంపెనీకి మరింత అవసరం.
Also Read: Vastu Tips: వాస్తు ప్రకారం ఈశాన్యానికి ఉన్న విలువ ఏంటో తెలుసా?
అయితే ఉద్యోగుల ఆదరాభిమానాలు చూర డగొనడంలో సంస్థ తరచూ విఫలం అవుతుండడంతో వారు రాజీనామా బాట ఎంచుకున్నారు. గతంలో తమ సమస్యలను సంస్థ ఎదుట విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా కెరీర్ లో గ్రోత్ లేకపోవడం, జీతాల్లో ఆశించినంత మేర పెరుగుదల లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. పైగా కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగులను ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సంస్థ తొలగించింది. హైదరాబాద్లో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించడంతో వారు ఐటి శాఖ మంత్రి కేటీఆర్, కార్మిక శాఖను ఆశ్రయించడంతో సంస్థ ప్రతినిధులను పిలిచి మాట్లాడారు. ఉద్యోగులను తొలగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అప్పుడు ఒక మెట్టు దిగి వచ్చిన సంస్థ కొద్ది రోజులపాటు ఉద్యోగులను ఇబ్బందులు పెట్టలేదు. తర్వాత పనితీరు బాగలేదని తొలగించింది.
-సంస్థ ఏం చెబుతోందంటే
కోవిడ్ తర్వాత ఐటి కంపెనీలకు ఆశించినంత మేర ప్రాజెక్టు లు రావడం లేదు. పైగా ఉక్రెయిన్- రష్యా యుద్ధం తర్వాత అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి తోడు అమెరికాలో ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లు సవరిస్తూ నిర్ణయం తీసుకోవడంతో గ్లోబల్ మార్కెట్లలో కంపెనీ షేర్ వాల్యూ పడిపోయింది. ఒక్క ఫార్మా , బ్యాంకింగ్ తప్ప సంస్థ నిర్వహిస్తున్న అన్ని వ్యాపారాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ తరుణంలో సంస్థ ఉద్యోగులు ఆశించినంత మేర జీతాల్లో పెరుగుదల ఇవ్వడం లేదు. పైగా మిడిల్ మేనేజ్మెంట్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలతో కంపెనీ అభాసుపాలవుతోంది. టిసిఎస్, విప్రో, టెక్ మహేంద్ర, జెన్ ఫ్యాక్ట్, క్యాబ్ జెమిని వంటి దిగ్గజ ఐటీ సంస్థలు ఉద్యోగులకు వేతనాల్లో భారీ పెరుగుదల ఇచ్చాయి. దీంతో ఆ కంపెనీలకు కాగ్నిజెంట్ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. గడచిన 90 రోజుల్లో సుమారు లక్షకు పైగా ఉద్యోగులు రాజీనామా సమర్పించారంటే కంపెనీపై వారికి ఉన్న ఆగ్రహాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా సంస్థ నష్ట నివారణ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

అవసరం.. జీతం, ఉద్యోగం ఈ మూడు ఉంటేనే ఉద్యోగులు ఉంటున్నారు. కరోనా తర్వాత అందరిలోనూ మార్పులు వచ్చాయి. సుఖవంతమైన మంచి జీతం, జీవితం ఉంటేనే ఉద్యోగులు పనిచేస్తున్నారు. లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. ఐటీలో వచ్చి ఈ సంక్షోభం ఎప్పుడు చల్లారుతుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్ అవుతోంది. ఐటీలో ఉద్యోగుల వలసలు కలవరపెడుతున్నాయి.

