Ranbir Kapoor
Ranbir Kapoor : పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న హీరోలలో ఒకరు రణబీర్ కపూర్(Ranbir Kapoor). బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ ఎంత పెద్దదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మన టాలీవుడ్ లో మెగా, నందమూరి ఫ్యామిలీస్ ఎంత పెద్దవో, బాలీవుడ్ లో అలా కపూర్ ఫ్యామిలీ పెద్దది. రిషి కపూర్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రణబీర్ కపూర్, బాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగిపోయాడు. ఈయన కేవలం ఒక కమర్షియల్ హీరో మాత్రమే కాదు, ఒక గొప్ప నటుడు కూడా. ఎలాంటి పాత్రలో అయినా ఓడిపోవడం ఆయన స్పెషాలిటీ. బ్రహ్మాస్త్రం, యానిమల్ చిత్రాలతో మన తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు. త్వరలో తెలుగులో కూడా ఆయన ఒక సినిమా చేయబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే రణబీర్ కపూర్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
Also Read : టాలీవుడ్ కి మకాం మార్చేసిన రణబీర్ కపూర్..వరుసగా తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు ప్లాన్!
ఒక లేడీ వీరాభిమాని తనపై చూపించిన ప్రేమాభిమానం గురించి ఆయన ఈ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను మీతో ఒక విచిత్రమైన సంఘటనను పంచుకోవాలని అనుకుంటున్నాను. ఒక అమ్మాయి నన్ను పిచ్చిగా అభిమానించేది. ఒకరోజు నేను ఊర్లో లేని సమయంలో ఆమె నా ఇంటి గేట్ వద్దకు వచ్చి, ఆ గేట్ ని పెళ్లి చేసుకుందట. ఆ గేట్ కి బొట్టు, పూలు పెట్టి వెళ్లిందట. నేను ఊరి నుండి తిరిగి రాగానే వాచ్ మ్యాన్ ఈ విషయాన్ని నాకు చెప్పాడు. నేను అది విని చాలా ఆశ్చర్యపోయాను. ఆమె నా మొదటి భార్య అని అనుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఆమె నా వద్దకు రాలేదు. ఆమె ఎలా ఉంటుందో చూడాలని ఉంది. ఆమె కోసం నేను ఎదురు చూస్తున్నాను, ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాతైనా వచ్చి కలుస్తుందేమో చూద్దాం’ అంటూ చెప్పుకొచ్చాడు.
అలియా భట్(Alia Bhatt) లాంటి భార్య ని పక్కన పెట్టుకొని రణబీర్ కపూర్ ఇంత ధైర్యం గా ఈ విషయం గురించి మాట్లాడడం అంటే సాహసం అనే చెప్పాలి. ఇకపోతే రణబీర్ కపూర్ యానిమల్ తర్వాత ‘రామాయణం’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన రాముడిగా నటిస్తుండగా, సీత గా సాయి పల్లవి(Sai Pallavo), రావణుడిగా యాష్(Yash), ఆంజనేయ స్వామిగా సన్నీ డియోల్, సూర్పనక్క గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి యాష్ సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థం లో మన ముందుకు రానుంది. రాముడి జననం నుండి, ఆయన తన తనువుని చాలించే వరకు జరిగిన స్టోరీ ని మొత్తం ఇందులో చూపించనున్నారు. మొత్తం మూడు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
Also Read : అనిమల్ సినిమా మీద వచ్చిన విమర్శలకు తన స్టైల్ లో క్లారిటీ ఇచ్చిన రన్బీర్ కపూర్…