https://oktelugu.com/

Ranbir Kapoor : అనిమల్ సినిమా మీద వచ్చిన విమర్శలకు తన స్టైల్ లో క్లారిటీ ఇచ్చిన రన్బీర్ కపూర్…

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు పాల్గొని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా వాళ్లకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు.

Written By: , Updated On : November 25, 2024 / 11:36 AM IST
Ranbir Kapoor gave clarity in his style to the criticisms on the movie Animal...

Ranbir Kapoor gave clarity in his style to the criticisms on the movie Animal...

Follow us on

Ranbir Kapoor : సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు పాల్గొని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా వాళ్లకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ జనరేషన్ లో ఉన్న ప్రేక్షకులకు నచ్చే సినిమాలను తీయడంలో మన దర్శకులు సక్సెస్ సాధిస్తూ వస్తున్నారు…

బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రన్బీర్ కపూర్ రాక్ స్టార్ గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్న విధానం అద్భుతం… ఇక ఈ హీరో తెలుగులో సంచలన దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగతో కలిసి గత సంవత్సరం ‘అనిమల్’ అనే సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా పాన్ ఇండియాలో 900 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టిన సినిమాగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద పలువురు సినీ సెలబ్రిటీలు సైతం విమర్శలను కురిపించిన సంగతి మనకు తెలిసిందే…ఇందులో హింస ను చూపించడమే కాకుండా, స్త్రీల పాత్రలకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా సినిమాను తీశారు అంటూ విమర్శించిన సంఘటనలు గతంలో మనం చూశాం… ఇక దానికి అనుగుణంగా గోవాలో నిర్వహిస్తున్న 55వ ‘ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (IIFI) లో పాల్గొన్న రన్బీర్ కపూర్ వాటి మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు…ఇక ఇంతకుముందు నేను చేసిన అనిమల్ సినిమా గురించి పలువురు సెలబ్రిటీలు రకరకాల విమర్శలు అయితే చేశారు దానికి నేను స్వాగతిస్తున్నాను. మా సినిమాలో హింస ఎక్కువగా ఉందన్నమాట వాస్తవం. కానీ మారుతున్న కాలంతో మనం కూడా మారుతూ జనానికి ఎలాంటి సినిమాలు అయితే కావాలో అలాంటి సినిమాలను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు. మేము కూడా మారుతున్న కాలానికి అనుగుణంగానే సినిమాను తీశాం.

ఆ సినిమా మెజార్టీ పీపుల్స్ కి నచ్చింది అంటూ తను మాట్లాడాడు ఇక దాంతోపాటుగా మన లెజెండరీ నటులకు సంబంధించిన సినిమాలను మరోసారి రిలీజ్ చేసి వాళ్ళ గురించి ఈ జనరేషన్ లో ఉన్న ప్రేక్షకులకు కూడా తెలిసేలా చేయాలి. అంటూ రన్బీర్ కపూర్ చాలా గొప్ప మాటలైతే మాట్లాడాడు.

మొత్తానికైతే ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ షోలో పాల్గొన్న రణ్బీర్ కపూర్ చాలా సింపుల్ గా స్వీట్ గా తన సమాధానాలను చెబుతూ అనిమల్ సినిమాను విమర్శించిన వాళ్ళకి సమాధానమైతే చెప్పాడు.

ఇక ఏది ఏమైనా కూడా రన్బీర్ కపూర్ లాంటి నటుడు తను చేయబోయే సినిమాలతో మరింత ఉన్నత శిఖరాలను చేరుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…