Ranbir Kapoor
Ranbir Kapoor : పాన్ ఇండియా లెవెల్లో యూత్ ఆడియన్స్ వెర్రెక్కిపోయే క్రేజ్ ఉన్న హీరోల లిస్ట్ తీస్తే అందులో రణబీర్ కపూర్(Ranbir Kapoor) కచ్చితంగా ఉంటాడు. బాలీవుడ్ లో చివరి సూపర్ స్టార్ ఇతనే అని అందరూ అంటుంటారు. ఆ రేంజ్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. లెజెండరీ హీరో రిషి కపూర్ తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రణబీర్ కపూర్, మొదటి సినిమా నుండి ఆడియన్స్ ని విన్నూతన రీతిలో ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ప్రతీ సినిమాతోనే ప్రేక్షకులను విశేషంగా అలరించి, ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల రేసులోకి దూసుకొచ్చాడు. ఇక ఆ తర్వాత కొన్ని క్లాసికల్ లవ్ స్టోరీస్ ద్వారా కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకొని, ‘యానిమల్'(Animal Movie) చిత్రంతో తిరుగులేని మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ దేశవ్యాప్తంగా సంపాదించుకున్నాడు. ఇప్పుడు రణబీర్ కపూర్ ఫోకస్ మొత్తం టాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యినట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం.
‘ యానిమల్ ‘ చిత్రం బాలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లో కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. రణబీర్ కపూర్ కి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఈ క్రేజ్ ని ఆయన విస్తరింపచేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా త్వరలోనే ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే తమిళ హీరో ధనుష్, మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ లతో తెలుగు చిత్రాలు చేసి భారీ సూపర్ హిట్స్ ని అందుకున్న ఆయన, ఇప్పుడు రణబీర్ కపూర్ ని తెలుగు లో గ్రాండ్ గా లాంచ్ చేసే పనిలో ఉన్నాడు. అందుకోసం ఒక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ని కూడా లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. కేవలం ఒక్క సినిమా కాదు, ఈ బ్యానర్ లో ఏకంగా మూడు సినిమాలు చేయడానికి సంతకం చేశాడట రణబీర్ కపూర్.
ఆ మూడు సినిమాలకు మన తెలుగు డైరెక్టర్స్ మాత్రమే ఉంటారు, నటీనటులు కూడా మన తెలుగోళ్ళే. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఆయన తిరిగినప్పుడు ఇక్కడి హీరోలకు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూసి ఆయన మెంటలెక్కిపోయాడట. ఎన్నో ఏళ్ళ నుండి బాలీవుడ్ లో ఉన్నాను, ఎంతో మంది బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ని అక్కడ చూసాను, కానీ ఆడియన్స్ అక్కడ సూపర్ స్టార్స్ మీద చూపించే ప్రేమ అంతంత మాత్రమే, కేవలం సినిమాలకే వరకే చూస్తారు, కానీ ఇక్కడ హీరోలను అభిమానులు దేవుళ్ళు లాగా కొలుస్తున్నారు, నాకు కూడా ఇలాంటి అభిమానులు కావాలి, తెలుగులో కచ్చితంగా స్ట్రెయిట్ సినిమాలు చేస్తాను అంటూ ఆయన ‘యానిమల్’ మూవీ ప్రొమోషన్స్ సమయంలోనే చెప్పుకొచ్చాడు. చెప్పిన మాటల ప్రకారం గానే ఆయన తెలుగులో త్వరలోనే గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతుండడం శుభ సూచికం. రాబోయే రోజుల్లో ఆయన మన తెలుగు ఆడియన్స్ అభిమానాన్ని ఎంత వరకు దక్కించుకుంటాడో చూడాలి.