Brahmastra First Review: రణబీర్ కపూర్ – ఆలియా భట్ జంటగా నటించిన కొత్త సినిమా బ్రహ్మాస్త్ర. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అయింది. సెన్సార్ కూడా అయ్యింది. సెన్సార్ అవుతున్న క్రమంలో ఈ సినిమాను ఆల్ రెడీ చూసిన ఓవర్‌సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు.. ఈ సినిమాకు రివ్యూ ఇచ్చాడు. ఫిల్మ్ క్రిటిక్ గా ఉమైర్ సంధుకు మంచి నేమ్ ఉంది.
గతంలో అతను ముందుగానే ‘దంగల్, బాహుబలి 2’, ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాల విషయంలో ఇలాగే రివ్యూ ఇచ్చారు. అవి నిజం అయ్యాయి కూడా. కాబట్టి బ్రహ్మాస్త్ర విషయంలో కూడా నిజం అవుతుందని నమ్మకం ఉంది. ఇంతకీ ఉమైర్ సంధు బ్రహ్మాస్త్ర రివ్యూలో ఏమి చెప్పాడంటే..
ఈ సినిమా గురించి మొత్తానికి ఉమైర్ సంధు షాకింగ్ రివ్యూ ఇచ్చాడు. “బ్రహ్మాస్త్ర సినిమాలో చెప్పుకునేంతగా గొప్ప కథ ఏమి లేదు. అయితే, స్క్రిప్ట్ పరంగా సినిమా స్టార్టింగ్ బాగుంది. కానీ, ఆ తర్వాత స్క్రీన్ ప్లే బాగా బోర్ గా సాగింది. ఒక్కమాటలో సినిమా జనాలని కట్టిపడేసే లాగా లేదు. సినిమా అయితే బాక్సాఫీస్ దగ్గర నిలవడం దాదాపు కష్టమే” అని రివ్యూ ఇచ్చాడు.
అలాగే ఈ సినిమా గురించి పాజిటివ్ కామెంట్స్ కూడా చెప్పాడు. బ్రహ్మాస్త్ర సినిమాలో విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. రెండు యాక్షన్ సీన్స్ కూడా అయితే చాలా బాగా తీశారని.. ఇక పాటలు కూడా చాలా బాగున్నాయి” అని ఉమైర్ సంధు చెప్పుకొచ్చాడు. నటీనటుల నటన విషయానికి వస్తే.. “రణబీర్ కపూర్ నటన బాగాలేదు. అతను చాలా సీన్స్ లో అయోమయంగా కనిపిస్తున్నాడు. అసలు అతను తెరపై ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. అంత దారుణంగా అతను ఈ సినిమాలో నటించాడు.
ఇక హీరోయిన్ గా నటించిన ఆలియా భట్ నటన మాత్రం చాలా బాగుంది. చూడటానికి కూడా ఆలియా భట్ చాలా అందంగా కనిపిచింది’ అంటూ ఉమైర్ సంధు తన రివ్యూలో తెలియజేశాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.