Bigg Boss Season 6 Adi Reddy: చిన్నపెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు టీవీ లకు అతుక్కుపొయ్యి చూసే ఏకైక బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్..ఇప్పటికే 5 సీసన్స్ ని పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు ఆరవ సీసన్ లోకి అడుగుపెట్టి విజయవంతంగా రెండు రోజులు పూర్తి చేసుకుంది..మొన్న ఆదివారం నాడు 21 ఇంటి సభ్యులతో ఘనంగా ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో మొదటి ఎపిసోడ్ నుండే ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో సక్సెస్ అయ్యింది..ఆసక్తికరమైన ‘క్లాస్ – ట్రాష్ – మాస్’ టాస్క్ తో మొదటి రోజు మంచి కంటెంట్ ని అయితే రాబట్టుకుంది..అయితే ఈ ఆరవ సీసన్ లో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియా లో రోజుకో వార్త ప్రచారం అవుతూ వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే..పలానా కంటెస్టెంట్ కి అంత రెమ్యూనరేషన్ వస్తుందని..పలానా కంటెస్టెంట్ ఈ రంగానికి చెందినవాడని ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అవ్వడం మనం రోజు చూస్తూనే ఉన్నాం.
అయితే ఈ సీసన్ లో ఉన్న 21 మంది కంటెస్టెంట్స్ మొత్తం మనకి ముఖపరిచయం ఉన్నవారే..కానీ ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ ని మాత్రం మనం ఎక్కువగా చూసి ఉండము..అలాంటి వారిలో ఒకరు ఆది రెడ్డి..నెల్లూరు జిల్లాకి చెందిన ఈయన యూట్యూబ్ ని ఫాలో అయ్యే వారికి తెలిసే ఉంటుంది..బిగ్ బాస్ కి ఇప్పటి వరుకు జరిగిన ప్రతి సీసన్ కి ఈయన రివ్యూలు ఇస్తూ ఉండేవాడు..ఈయన రివ్యూస్ కి యూట్యూబ్ లో మంచి క్రేజ్ కూడా ఉంది.
ఇన్ని రోజులు రివ్యూస్ ఇస్తూ వచ్చిన ఈయనకి బిగ్ బాస్ హౌస్ లో అవకాశం రావడం విశేషం..అయితే హౌస్ లో పాల్గొంటున్న అందరి కంటెస్టెంట్స్ కంటే ఈయనే అతి తక్కువ పారితోషకం తీసుకుంటున్న కంటెస్టెంట్ అట..మిగిలిన కంటెస్టెంట్స్ రోజుకి లక్ష రూపాయిల రేంజ్ లో పారితోషికం తీసుకుంటూ ఉంటె ఆది రెడ్డి కి మాత్రం కేవలం వారానికి లక్ష 20 వేల రూపాయిల పారితోషికం మాత్రమే ఇస్తున్నారట..అలా ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో తక్కువ పారితోషికం మరియు తక్కువ పాపులారిటీ ఉన్న ఆది రెడ్డి ఎన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో విజయవంతంగా కొనసాగుతాడు అనేది చూడాలి.
Also Read:Hari Hara Veeramallu: సోషల్ మీడియా లో లీకైన ‘హరి హర వీరమల్లు’ మూవీ ఇంటర్వెల్ సీన్