Brahmastra Collections: రణబీర్ కపూర్ – ఆలియా భట్ జంటగా నటించిన కొత్త సినిమా బ్రహ్మాస్త్ర. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం 400 కోట్ల బడ్జెట్ తో రూపొందించడంతో పాటు ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, నాగార్జున వంటి స్టార్లు నటించారు. పైగా రాజమౌళి దక్షిణాదిన భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసి పంపిణీ చేసిన సినిమా ఇది. మరి ఈ సినిమాకి తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, ఈ సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయా ? రాలేదా ? చూద్దాం రండి.

ముందుగా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
నైజాం 4.18 కోట్లు
సీడెడ్ 0.90 కోట్లు
ఉత్తరాంధ్ర 0.85 కోట్లు
ఈస్ట్ 0.60 కోట్లు
వెస్ట్ 0.40 కోట్లు
గుంటూరు 0.65 కోట్లు
కృష్ణా 0.35 కోట్లు
నెల్లూరు 0.28 కోట్లు
ఏపీ + తెలంగాణలో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ గానూ రూ: 8.21 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ: 16.43 కోట్లు వచ్చాయి.

‘బ్రహ్మాస్త్ర’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.4.8 కోట్ల షేర్ ను రాబట్టాలి. అయితే, ఈ సినిమాకి మొదటి రోజు మొదటి షో నుంచే బాగా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ సినిమాలో షారుఖ్ ఖాన్, అమితాబ్ – నాగ్ కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. పైగా రణబీర్ – అలియా అద్భుతంగా నటించారు. మొత్తమ్మీద ఈ సినిమాలో ఉన్న లార్జ్ స్టార్ కాస్ట్ కారణంగా ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి. ఫలితంగా ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం భారీగా రూ.8.21 కోట్ల షేర్ ను రాబట్టింది.