https://oktelugu.com/

Manchu Vishnu: మంచు విష్ణు కొత్త ఛాలెంజ్​.. నెట్టింట్లో పోస్ట్ వైరల్​

Manchu Vishnu: టాలీవుడ్​ హీరో, మా సినీ అసోషియేషన్​ అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా తనకు తానే కొత్త ఛాలెంజ్​ విసురుకున్నారు. విషయాన్ని తానే స్వయంగా సోషల్​మీడియా వేదికగా అభిమానులకు వెల్లడించారు. ఇంతకు ముందుకు నాకు చాలా మంచ బాడీ ఉందని అనుకునే వాడ్ని. లేజీనెస్​ వల్ల ఇప్పుడు అదంతా పోయింది. జనవరి నుంచి ఛాలెంజ్​ను స్టార్ట్​ చేస్తున్నా.. వచ్చే రెండు నెలల్లో లాస్ట్ ఎక్కడ వదిలేశానో.. అక్కడే స్టార్ట్ చేస్తా.. పనైతే ఎక్కువే ఉంది.. కుదలేదు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 9, 2021 / 02:38 PM IST
    Follow us on

    Manchu Vishnu: టాలీవుడ్​ హీరో, మా సినీ అసోషియేషన్​ అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా తనకు తానే కొత్త ఛాలెంజ్​ విసురుకున్నారు. విషయాన్ని తానే స్వయంగా సోషల్​మీడియా వేదికగా అభిమానులకు వెల్లడించారు. ఇంతకు ముందుకు నాకు చాలా మంచ బాడీ ఉందని అనుకునే వాడ్ని. లేజీనెస్​ వల్ల ఇప్పుడు అదంతా పోయింది. జనవరి నుంచి ఛాలెంజ్​ను స్టార్ట్​ చేస్తున్నా.. వచ్చే రెండు నెలల్లో లాస్ట్ ఎక్కడ వదిలేశానో.. అక్కడే స్టార్ట్ చేస్తా.. పనైతే ఎక్కువే ఉంది.. కుదలేదు ఈ సాకులన్నీ నేను చెప్పను. మైండ్​ స్ట్రాంగ్​గా ఉంచుకుని చేసి చూపిస్తా.. అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు విష్ణు ఛాలెంజ్​పై ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

    Manchu Vishnu

    ఇటీవల జరిగిన మా అధ్య ఎన్నికల్లో ప్రకాశ్​రాజ్​పై మంచు విష్ణు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రకాశ్​రాజ్​ మా సభ్యత్వానికి రాజీనామా చేశారు కూడా. అనంతరం ఆయన కొత్త కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు అందరూ భావించారు. అయితే, అవన్నీ కేవరం పుకార్లని ప్రకాశ్​రాజ్​ కొట్టిపడేశారు. సేవ చేయాలంటే పదవి ఉండాల్సిన అవసరం లేదని అన్నారు.

    Also Read: ఎక్స్ పోజింగ్ లో విశ్వరూపం చూపిస్తోన్న సమంత !

    ప్రస్తుతం పలు సినిమాల్లో ఫుల్​ బిజీగా ఉన్నారు ప్రకాశ్​ రాజ్​.. కేజీఎఫ్ 2లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే వచ్చిన జై భీమ్ లోనూ నటించారు. కాగా, ప్రస్తుయం ఆయనకు ఓకల్​కార్డ్ సమస్య తలెత్తడంతో.. విశ్రాంతి తీసుకుంటున్నారు.

    మరోవైపు మంచి విష్ణు ఢీ అంటే ఢీ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. అలాగే మోహన్​బాబు నటిస్తున్న సన్​ ఆఫ్ ఇండియా సినిమాను తానే స్వయంగా నిర్మిస్తున్నారు. 2020లోఆయన నటించిన మోసగాళ్లు, చదరంగం చిత్రాలు విడుదల కాగా.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. మరి ఢీ సినిమాతోనైనా హిట్ కొడతారేమో చూడాలి.

    Also Read: ఢీ-13 టైటిల్‌ విజేత ఎవరంటే… స్పెషల్ గెస్ట్ గా అల్లు అర్జున్