Jayamma Panchayithi: ప్రముఖ టాలీవుట్ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటించిన సినిమా జయమ్మ పంచాయితీ.. ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. దీన్ని రానా దగ్గుబాటి విడుదల చేశారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. సుమగారు ఎందరికో స్ఫూర్తినిచ్చే మహిళని పొగిడారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. సినిమాలు షోలు చేస్తూ.. ఇతర భాషల్లో కూడా సుమ కెరీర్ పరంగా ముందుకు దూసుకెళ్లిపోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు రానా. విజయ్ కలివారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బలగ ప్రకాశ్ నిర్మించారు.

ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ.. సినిమా చాలా కొత్తగా ఉందని.. ఇందులో జయమ్మ కథతో పాటు మరికొన్ని కథలు కూడా ఉన్నాయని అన్నారు. వ్యక్తిత్వం పరంగా నేను వేరు జయమ్మ వేరు.. అయితే నేను కూడా జయమ్మ లాగే ఉండాలనుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకు 18 రోజులే పని చేయాలనుకున్నా.. 40 రోజులు పట్టింది. ఈ సినిమా కోసమే శ్రీకాకులం యాస నేర్చుకున్నా. ఈ సినిమాతో నన్ను యాంకర్‌గా ప్రేక్షకులు మర్చిపోతారని రానా చెప్పారు. కానీ అది అదే .. ఇది ఇదే.. అని సరదాగా చెప్పుకొచ్చింది సుమ.
మరోవైపు కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గురించి మాట్లాడుతూ.. కీరవాణికి ఫోన్ చేసి అడగ్గానే ఒప్పేసుకున్నారని అన్నారు. సంకల్పం ధృఢంగా ఉంటే కాలమే ముందుకు నడిపిస్తుందని అన్నారు సుమ.