Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Shah Rukh Khan collaboration: అల్లు అర్జున్ కోసం షారుఖ్ ఖాన్.. ఫ్యాన్స్...

Allu Arjun Shah Rukh Khan collaboration: అల్లు అర్జున్ కోసం షారుఖ్ ఖాన్.. ఫ్యాన్స్ కి మెంటల్ ఎక్కిపోయే రేంజ్ అప్డేట్ !

Allu Arjun Shah Rukh Khan collaboration: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) , అట్లీ(Atlee) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి ఇప్పటి వరకు అధికారికంగా ఒక్క అప్డేట్ కూడా బయటకు రాకపోయినప్పటికీ, ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఎందుకంటే ‘పుష్ప 2 ‘ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ , ‘జవాన్ ‘ లాంటి వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ తర్వాత అట్లీ , కలిసి చేస్తున్న సినిమా కాబట్టే, ఈ మూవీ పై ఆడియన్స్ లో ఇంతటి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ ని రెట్టింపు చేస్తూ , ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో ప్రచారం అయ్యే కొన్ని వార్తలు అభిమానుల్లో ఒక రేంజ్ ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు , అనగా ఏప్రిల్ 8 న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ గ్లింప్స్ ని విడుదల చేయబోయేది మరెవరో కాదు, బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ అట. అట్లీ తో తనకు ఉన్నటువంటి రిలేషన్ కారణంగానే ఆయన ఈ ట్రైలర్ ని లాంచ్ చేసేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక అప్డేట్ త్వరలోనే రాబోతుంది అట. బాలీవుడ్ లో అల్లు అర్జున్ కి ప్రస్తుతం ఖాన్స్ తో సమానమైన క్రేజ్ ఉంది. అలాంటి స్టార్ కి ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా ప్రొమోషన్స్ కార్యక్రమాల్లో తోడయ్యాడు. ఇక ఈ సినిమా రేంజ్ ఎలా ఉండబోతుందో మీరే ఊహించుకోండి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను ఈ ఏడాది జూన్ లోపు పూర్తి చెయ్యాలని చూస్తున్నారట. ఇప్పటికే 50 శాతం కి పైగా షూటింగ్ పూర్తి అయ్యింది. పలు సన్నివేశాలను రీ షూట్ కూడా చేశారట.

జూన్ నెలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే , అల్లు అర్జున్ లోకేష్ కనకరాజ్ తో చేయబోయే సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. అట్లీ తో చేసే సినిమా పూర్తిగా VFX మీద ఆధారపడడంతో, కేవలం VFX కోసం ఏడాది సమయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చెయ్యాలని అనుకున్నారు కానీ, అది కుదిరేలా లేదు. దసరా కే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో హీరోయిన్స్ గా మృణాల్ ఠాకూర్, దీపికా పదుకొనే , జాన్వీ కపూర్ వంటి వాళ్ళు నటిస్తుండగా , రష్మిక మందాన విలన్ రోల్ లో కనిపించబోతుంది టాక్. ఇక అల్లు అర్జున్ ఈ చిత్రం ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version