Homeఎంటర్టైన్మెంట్Hiranyakashyapa : హిరణ్యకశ్యప ప్రకటించిన రానా... గుణశేఖర్ కి హ్యాండ్, త్రివిక్రమ్ లైన్లోకి!

Hiranyakashyapa : హిరణ్యకశ్యప ప్రకటించిన రానా… గుణశేఖర్ కి హ్యాండ్, త్రివిక్రమ్ లైన్లోకి!

Hiranyakashyapa : నాలుగేళ్ళ క్రితమే దర్శకుడు గుణశేఖర్ హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ ప్రకటించారు. ఇది ఆయన డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకు అమరచిత్ర కథలు ఆధారం. గుణశేఖర్ హిరణ్యకశ్యప ప్రీ ప్రొడక్షన్ కూడా జరిపారు. అందుకు కొన్ని కోట్లు ఖర్చు చేశారు. ప్రణాళిక ప్రకారం జరిగితే రానా-గుణశేఖర్ ల హిరణ్యకశ్యప 2020లోనే పట్టాలెక్కాల్సింది. కరోనా పరిస్థితులతో పాటు పలు కారణాలతో హిరణ్య కశ్యప ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ క్రమంలో గుణశేఖర్ శాకుంతలం మొదలుపెట్టారు. 

 
శాకుంతలం చిత్రానికి ఏడాదికి పైగా సమయం కేటాయించారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం డిజాస్టర్ అయ్యింది. దీంతో హిరణ్యకశ్యప లేనట్లే అని కథనాలు వెలువడ్డాయి. అనూహ్యంగా జులై 19న రానా హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ ప్రకటించారు. అయితే గుణశేఖర్ పేరు లేదు. కొత్తగా త్రివిక్రమ్ పేరొచ్చి చేరింది. హిరణ్యకశ్యప చిత్రానికి త్రివిక్రమ్ కథ అందిస్తున్నట్లు తెలియజేశారు. 
 
హిరణ్యకశ్యప డైరెక్టర్ ఎవరనేది తెలియజేయలేదు. గుణశేఖర్ అయితే ఈ ప్రాజెక్ట్ చేయడం లేదు. ఏళ్ల తరబడి ఆయన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. ఈ క్రమంలో ఆయన తన అసహనం ట్విట్టర్ వేదికగా బయటపెట్టాడు. పేర్లు ప్రస్తావించకుండా రానా, త్రివిక్రమ్ లను టార్గెట్ చేశారు. వారికి నైతికత లేదని ఘాటు కామెంట్స్ చేశారు. గుణశేఖర్ కి ఆయన మద్దతుగా నిలుస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ కోసం మీరు చాలా కష్టపడ్డారు, త్రివిక్రమ్, రానాలు మోసం చేశారంటూ అభిప్రాయపడుతున్నారు. 
 
ఇక హిరణ్యకశ్యప దర్శకుడు ఎవరనే సందేహాలు అందరి మదిలో మెదలాడుతున్నాయి. గత ఏడాది రానా భీమ్లా నాయక్, విరాటపర్వం చిత్రాల్లో నటించారు. ఆయన హీరోగా చేసిన విరాటపర్వం నిరాశపరిచింది. హీరోగా రానా ఫార్మ్ లో లేడు. అయితే ఆయనకు ఇండియా వైడ్ పాపులారిటీ ఉంది. అందుకే ఇంతటి భారీ చిత్రం ప్రకటించారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు. 
Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version