https://oktelugu.com/

వైరల్ అవుతోన్న ‘రమ్యకృష్ణ -సత్యరాజ్’ వీడియో !

రాజమౌళి అద్భుత సృష్టి ‘బాహుబలి’ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో.. ఆ సినిమాలో శివగామి పాత్రలో నటించిన ఆల్ టైం గ్లామర్ బ్యూటీ రమ్యకృష్ణ కూడా అంత పాపులర్ అయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో శివగామి, కట్టప్ప పాత్రలు మీద వచ్చినన్నీ జోక్స్ అండ్ పేరడీస్ బాహుబలి పాత్ర మీద కూడా రాలేదు. మొత్తానికి శివగామి పాత్రకు అంత క్రేజ్‌ ఉంది. సినిమా రిలీజ్ అయి సంవత్సరాలు గడుస్తోన్నా.. ఇప్పటికీ శివగామి పాత్రకు ఉన్న […]

Written By:
  • admin
  • , Updated On : September 19, 2020 / 04:55 PM IST
    Follow us on


    రాజమౌళి అద్భుత సృష్టి ‘బాహుబలి’ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో.. ఆ సినిమాలో శివగామి పాత్రలో నటించిన ఆల్ టైం గ్లామర్ బ్యూటీ రమ్యకృష్ణ కూడా అంత పాపులర్ అయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో శివగామి, కట్టప్ప పాత్రలు మీద వచ్చినన్నీ జోక్స్ అండ్ పేరడీస్ బాహుబలి పాత్ర మీద కూడా రాలేదు. మొత్తానికి శివగామి పాత్రకు అంత క్రేజ్‌ ఉంది. సినిమా రిలీజ్ అయి సంవత్సరాలు గడుస్తోన్నా.. ఇప్పటికీ శివగామి పాత్రకు ఉన్న ఆ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరి కదా.. ఎప్పటికపుడు ఆ పాత్ర మీద పేరడీలు వస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

    Also Read: టాలెంటెడ్ హీరోయిన్ డైరెక్షన్ చేస్తానంటుంది !

    ఏది ఏమైనా రమ్యకృష్ణ సినీ కెరీర్‌లోనే శివగామి పాత్ర ఓ మైలురాయిగా నిలిచిపోయింది. దానికి తగ్గట్లే సెకండ్ ఇన్నింగ్స్‌ లోనూ రమ్యకృష్ణ కూడా రెచ్చిపోయి మరీ నటిస్తోంది. అయితే తాజాగా శివగామి – కట్టప్ప పాత్రలకు సంబంధించిన ఓ వీడియో బాగా వైరల్ఆవుతొంది. సినిమాలో కట్టప్ప, శివగామి, కాలకేయ మధ్య సంభాషణలకు సంబంధించిన సీన్ బాగా పేలింది. ముఖ్యంగా ఆ సీన్ చివర్లో శివగామి.. ‘కట్టప్ప.. సమర శంఖం పూరించు’ అనే డైలాగ్ ను రమ్యకృష్ణ ఎంతో రాజసంతో చెబుతుంది. అయితే అంత రాజసంతో ఉన్న సీన్ ను కూడా ఇప్పుడు కామెడీ చేసేశారు.

    Also Read: రియల్ హీరో అనిపించుకున్న ‘మెగా హీరో’

    ఆ సీన్‌ కు ఐపీఎల్ కు మధ్య లింకు పెట్టి చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. మొత్తానికి ఈ వీడియోను రమ్యకృష్ణనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఐపీఎల్ ప్రారంభం కాబోతోన్న ఈ తరుణంలో రమ్యకృష్ణ ఈ వీడియోను షేర్ చేయడంతో వీడియో మరింతగా వైరల్ అవుతుంది. ఇక వీడియోలో శివగామి, కట్టప్పను ఆర్డర్ వేసినట్టుగా వీడియోలో ఉంది. దానికి తోడు కట్టప్ప సమర శంఖం పూరిస్తుంటే.. మధ్యలో ఐపీఎల్ మ్యూజిక్ రావడం, ఆ పై చంద్రముఖి సినిమాలో రజినీ సన్నాయి వాయించడం మొత్తానికి వీడియో పై బాగా ఆసక్తిని పెంచాయి.