https://oktelugu.com/

Heroine`s Party: పార్టీలో రచ్చ చేసిన సీనియర్ హీరోయిన్లు

80,90వ దశకంలో దక్షిణాదిన ఊపు ఊపిన హీరోయిన్లు అంతా ఇప్పుడు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. లేటు వయసులో ఘాటుగా పార్టీలు చేసుకుంటున్నారు.ఈ సీనియర్ హీరోయిన్లు అంతా ఒకే వేదికపై కలుసుకుంటూ తమ సెకండ్ ఇన్నింగ్స్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లుగా దక్షిణాదిన పలు భాషల్లో సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే అయినా కూడా తమ ఇళ్లలో వేడుకలకు మాత్రం అందరూ కలుసుకుంటూ సందడి చేస్తున్నారు.సోషల్ మీడియాలో తమ పార్టీల తాలూకా వీడియోలు […]

Written By:
  • NARESH
  • , Updated On : August 19, 2021 / 06:02 PM IST
    Follow us on

    80,90వ దశకంలో దక్షిణాదిన ఊపు ఊపిన హీరోయిన్లు అంతా ఇప్పుడు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. లేటు వయసులో ఘాటుగా పార్టీలు చేసుకుంటున్నారు.ఈ సీనియర్ హీరోయిన్లు అంతా ఒకే వేదికపై కలుసుకుంటూ తమ సెకండ్ ఇన్నింగ్స్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

    ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లుగా దక్షిణాదిన పలు భాషల్లో సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే అయినా కూడా తమ ఇళ్లలో వేడుకలకు మాత్రం అందరూ కలుసుకుంటూ సందడి చేస్తున్నారు.సోషల్ మీడియాలో తమ పార్టీల తాలూకా వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

    అలనాటి హీరోయిన్లు అయిన రోజా, మీనా, రమ్యక్రిష్ణ, సుహాసిని, కుష్బూ, రాధిక వంటి వారు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా సుహాసిని బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ బర్త్ డే వేడుకకు కమల్ హాసన్ ఫ్యామిలీ కదిలి వచ్చింది. ఇక ఈ సీనియర్ హీరోయిన్లు అంతా కూడా వచ్చారు. అందరూ కలిసి పార్టీలో తెగ ఎంజాయ్ చేశారు. పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేశారు.

    మొన్నీ మధ్యనే సుహాసిని బర్త్ డే వేడుకల్లో దుమ్ములేపిన ఈ నటీమణులు ఆ ఫొటోలు పంచుకోవడంతో వారి ఎంజాయ్ మెంట్ ఏ లెవల్ లో సాగిందో అర్థమైంది. ఈ బర్త్ డే వేడుకలో రమ్యక్రిష్ణ, సుహాసిని, కుష్బూలు అందరూ డ్యాన్స్ లు చేసి అలరించారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.