Homeఎంటర్టైన్మెంట్Acharya Movie Reshoot : ఆచార్య రీషూట్ కి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ !

Acharya Movie Reshoot : ఆచార్య రీషూట్ కి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ !

Chiranjeevi‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’గా కొరటాల శివకు మంచి పేరు ఉంది. పైగా మొదటిసారి మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ ( Acharya) సినిమా చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా పై అభిమానుల్లో ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అయితే, ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్.

లాస్ట్ షెడ్యూల్‌ షూట్ ను కాకినాడలో చేశారు. ఈ షెడ్యూల్‌ ఐదు రోజులు జరిగింది. చిరంజీవి (Megastar Chiranjeevi), సోనూసూద్‌ కాంబినేషన్‌ లో వచ్చే సీన్స్‌ ను తెరకెక్కించారు. అయితే సినిమాలో హెవీ ఎమోషనల్ గా సాగే ఈ సీన్స్ అవుట్ ఫుట్ పట్ల కొరటాల పూర్తి సంతృప్తిగా లేడు. అందుకే, మళ్ళీ ఈ సీన్స్ ను రీషూట్ చేయాలని ప్రపోజల్ పెట్టాడు.

అయితే, చిరు కూడా ఈ సీన్స్ కోసం అదనపు డేట్స్ కేటాయిస్తూ మళ్ళీ మరో మూడు రోజుల పాటు డేట్స్ ఇచ్చాడు. అలాగే వెంటనే తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పడానికి వచ్చే వారం నుండి రెడీ కానున్నాడు. ఇక ఈ సినిమా నుండి ఆ మధ్య రిలీజ్ అయిన ‘లాహే లాహే’ పాట మంచి విజయం సాధించింది.

దాంతో సినిమా పై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. పైగా మెగాస్టార్ కెరీర్ లో ఈ సాంగ్ కి రికార్డు మిలియన్ల వ్యూస్ రావడం ఇదే మొదటిసారి. అందుకే, మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. పాన్ ఇండియా సినిమా రానున్న ఈ సినిమాలో చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక మెగాస్టార్‌ చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. నిరంజన్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version