సబ్ రిజిస్రార్ కార్యాలయాల్లోకి నకిలీ చలాన్లు ఎలా వచ్చాయి? అధికారుల పాత్ర ఎంత? ఏసీబీకి ఎలా తెలిసింది? తదితర విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఏసీబీ అధికారులు దాడులు చేస్తే తప్ప నకిలీ చలాన్ల విషయం వెలుగులోకి రాలేదు. దీనిపై జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవడంలో అధికారులు ఏ మేరకు సఫలం అవుతున్నారో తెలుసుకున్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేశామని అధికారులు సీఎం జగన్ కు సూచించారు.
రాష్ర్ట ఖజానా పెంచే విధంగా విధులు చేపట్టాల్సిన అధికారులు అడ్డదారులు తొక్కడంపై అందరిలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందుబాటులో ఉన్న ఆదాయ వనరులను పెంచుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ర్ట ఆదాయానికి వచ్చే మార్గాలపై దృష్టి నిలపాలని పేర్కొన్నారు. ఆదాయ వనరులపై సంస్కరణలు చేపట్టి పలు శాఖల్లో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ శాఖలపై ఇంటిలిజెన్స్ అధికారులు నిఘా వేయాలని సూచించారు. ప్రతి కార్యాలయంలో అవినీతిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో నెంబర్లు ఉంచాలని చెప్పారు. ప్రభుత్వ శాఖల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాలని అన్నారు. అవినీతి, అక్రమాలపై ఎప్పటికప్పుడు నిఘా పెంచాలని వివరించారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. మీ సేవలో పరిస్థితులపై పరిశీలన చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.