Ramya Krishna
Ramya Krishna : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నమైతే చేస్తున్నారు. ఒకసారి స్టార్ ఇమేజ్ వచ్చిందంటే చాలు వరుసగా సినిమాల ఆఫర్లు వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక వాళ్ళు చేసే పాత్రలో ప్రాణం పెట్టి నటించి ఆ పాత్రకి సినిమాలో మంచి గుర్తింపు వచ్చే విధంగా ప్రణాళికలైతే రూపొందించుకుంటున్నారు…
ప్రభాస్ (Prabhas) హీరోగా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన బాహుబలి (Bahubali) సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా వీళ్ళ కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇక తెలుగు సినిమా స్టామినాను పాన్ ఇండియా లెవెల్లో చాటి చెప్పిన ఘనత కూడా ఈ సినిమాకే దక్కడం విశేషం…మరి ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా కూడా భారీ వసూళ్లను రాబడుతుందనే అంచనా వేసి భారీ రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇక బాహుబలి సిరీస్ మొత్తానికైతే భారీగా ఎలివేట్ అవ్వడమే కాకుండా తెలుగు సినిమా స్టామినాని కూడా ప్రపంచ స్థాయిలో తెలిసే చేసింది. ఇక ఈ సినిమా కోసం రాజమౌళి విపరీతంగా కష్టపడ్డాడనే విషయం మనందరికి తెలిసిందే. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ లో ఒక గొప్ప విశిష్టత అయితే ఉంటుంది. దాన్ని ముందుగానే రాజమౌళి మొత్తం డిజైన్ చేసుకొని ప్రతి క్యారెక్టర్ యొక్క ఆర్క్ తో ముందుకు సాగాడు. మరి ఇలాంటి సందర్భంలోనే రాజమాత శివగామి గా నటించి మెప్పించిన రమ్యకృష్ణ పాత్ర మొత్తానికైతే మూవీకి హైలైట్ గా నిలిచింది. ఇక ఆమె తన క్యారెక్టర్ లో ఉన్న గొప్పతనాన్ని ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తెలిసేలా బాగా నటించి మెప్పించింది…ఇక ఆమె ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతూనే ఉంది. అయితే ఈ సినిమాలో తను పడిన కష్టానికి గాను మంచి గుర్తింపు అయితే వచ్చింది.
ఈ క్యారెక్టర్ లో వేరే నటిని అనుకున్నప్పటికి వాళ్ళకి ఆ క్యారెక్టర్ నచ్చకపోవడంతో ఆ సినిమాను రిజెక్ట్ చేశారు. ఇక ఏది ఏమైనా కూడా రమ్యకృష్ణ ఈ క్యారెక్టర్ ను చేసి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంది…ఇక ఈ సినిమాలో ఆమె నటించినందుకు గాను ఆమె 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందట.
మరి మొత్తానికైతే భారీ బడ్జెట్ సినిమా కావడం ఎక్కువ రోజులు ఈ సినిమాకి డేట్స్ కేటాయించడం బయట వేరే సినిమాలను కూడా చేయకుండా ఉండాలి. కాబట్టి రమ్యకృష్ణ అంత మొత్తాన్ని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది…
అయితే రెండు పార్టులు కలిపి ఆమె 10 కోట్లు తీసుకోవడంలో ఆశ్చర్యమైతే ఏమీ లేదు అంటూ మరి కొంతమంది సినిమా మీద తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…ఇక అప్పటి నుంచి ఆమె పవర్ ఫుల్ పాత్రలను పోషిస్తు ముందుకు సాగుతుండటం విశేషం…