Subbaraju : సౌత్ ఇండియా లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న వారిలో ఒకరు సుబ్బరాజు(Actor Subbaraju). కృష్ణవంశీ తెరకెక్కించిన ‘ఖడ్గం’ అనే చిత్రం ద్వారా ఈయన చిన్న పాత్రతో వెండితెర అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత ఆయన పూరి జగన్నాథ్(Puri Jagganath), రవితేజ(Mass Maharaja Raviteja) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ చిత్రంలో నటించాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా సుబ్బరాజు కి మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మరుసటి సంవత్సరం లో శ్రీ ఆంజనేయం, నేనున్నాను, ఆర్య, సాంబ, చంటి, సూర్యం వంటి సినిమాలు చేసాడు. అలా తన కెపాసిటీ ని పెంచుకుంటూ ఏడాదికి 10 నుండి 20 సినిమాల వరకు చేసే ఛాన్స్ దక్కింది. అయితే సుబ్బరాజు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ‘బాహుబలి 2′(Bahubali2 Movie) ఎంతో ప్రత్యేకం.
ఇందులో ఆయన చాలా బలమైన క్యారక్టర్ చేసాడు. ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ కూడా వచ్చింది. ముఖ్యంగా జపాన్ వంటి దేశాల్లో సుబ్బరాజు కి ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టిన ఈ సినిమా గురించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సుబ్బరాజు మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘బాహుబలి 2 సినిమా నాకు ఎంత పేరు ని తెచ్చిపెట్టిందో, అంతే నష్టాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోనే నాకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ వచ్చాయి. కానీ రాజమౌళి సినిమాకి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు తెలిసిందే కదా, ఏ సినిమాకి కూడా ఒప్పుకోకూడదు. పైగా నాది ఆ సినిమాలో చిన్న క్యారక్టర్ కూడా కాదు. కానీ విడుదల తర్వాత ఈ సినిమా ద్వారా వచ్చిన పేరు ప్రఖ్యాతలు చూసి, ఇక చాలు, సినిమాలను ఆపేసిన పర్వాలేదు అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇది ఇలా ఉండగా సుబ్బరాజు గత ఏడాది లో కేవలం వలరి, డబుల్ ఇస్మార్ట్, జితేందర్ రెడ్డి వంటి సినిమాలు చేసాడు. ఈ సినిమాలేవీ కూడా ఆయనకు కమర్షియల్ సక్సెస్ ని ఇవ్వలేదు. కానీ ఈ ఏడాది ఆయనకు కుంభస్థలాన్ని బద్దలు కొట్టే అవకాశం వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రంలో చాలా ముఖ్యమైన క్యారక్టర్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా మొత్తం కలిసి ఉండే స్నేహితుల పాత్రలో ఆయన కనిపించనున్నాడు. సినిమా హిట్ అయితే కచ్చితంగా సుబ్బరాజు కి మంచి క్రేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా ద్వారా ఆయన మరోసారి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ హైలైట్ అవ్వొచ్చు. మరి ఆ రేంజ్ కి వెళ్తాడా లేదా అనేది తెలియాలంటే మార్చి 28 వరకు ఆగాల్సిందే.
Also Read : యూఎస్ లో నటుడు సుబ్బరాజు భార్య ఏం చేస్తుంది? స్రవంతి ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏమిటీ? ఇంట్రెస్టింగ్ డిటైల్స్