https://oktelugu.com/

ఎన్నో సమస్యలు.. ఎట్టకేలకు ఇప్పటికీ రిలీజ్ ఫిక్స్ !

హీరో రామ్ ఎంతో కష్టపడి చేసిన సినిమా ‘రెడ్’. సినిమా మొదలైన దగ్గర నుండి ఇప్పటివరకూ రామ్ కు ఈ సినిమా వల్ల అన్ని టెన్సన్సే. షూట్ జరిగేటప్పుడే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ సాయి తేజ్ సినిమాలో కూడా ఉన్నాయని తెలిసి మళ్లీ రెడ్ సీన్స్ రీషూట్ చేసుకున్నారు. దీనికి తోడు ఓ హీరోయిన్ కొన్ని రోజులు షూట్ లో పాల్గొని ఆ తరువాత సినిమా చేయలేను అని హ్యాండ్ ఇచ్చింది. దాంతో మరి కొన్ని […]

Written By:
  • admin
  • , Updated On : December 12, 2020 / 10:16 AM IST
    Follow us on


    హీరో రామ్ ఎంతో కష్టపడి చేసిన సినిమా ‘రెడ్’. సినిమా మొదలైన దగ్గర నుండి ఇప్పటివరకూ రామ్ కు ఈ సినిమా వల్ల అన్ని టెన్సన్సే. షూట్ జరిగేటప్పుడే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ సాయి తేజ్ సినిమాలో కూడా ఉన్నాయని తెలిసి మళ్లీ రెడ్ సీన్స్ రీషూట్ చేసుకున్నారు. దీనికి తోడు ఓ హీరోయిన్ కొన్ని రోజులు షూట్ లో పాల్గొని ఆ తరువాత సినిమా చేయలేను అని హ్యాండ్ ఇచ్చింది. దాంతో మరి కొన్ని సీన్స్ ఎందుకు పనికిరాకుండా పోయాయి. ఇక అన్ని సమస్యలు తీర్చుకున్నాక సినిమాని రిలీజ్ చేద్దామనుకుంటే.. తీరా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే టైంలో కరోనా మహమ్మారి వచ్చేసింది. ఇక కరోనా దెబ్బకు ఎప్పుడో సమ్మర్ లో రావాల్సిన సినిమాల రిలీజ్ పరిస్థితి పూర్తిగా గందరగోళంలో పడిపోయింది.

    Also Read: ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. అది నిజమే !

    దాంతో దర్శకనిర్మాతలకు ఇష్టం లేకపోయినా ఓటీటీలలో తమ సినిమాలను రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పటికే కొన్ని పెద్ద సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయి క్యాష్ చేసుకున్నాయి. అయితే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన రామ్ ‘రెడ్’ మాత్రం అటు ఓటీటీలో రిలీజ్ కాక, ఇటు థియేటర్ ల్లో రిలీజ్ చేయలేక మొత్తానికి గత ఏడు నెలలుగా ల్యాబ్ లోనే పడిఉంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం సంక్రాంతికి స్పెషల్ గా రామ్ రెడ్ ను రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం అయింది. జనవరి 13వ తేదీ నుండి వారం రోజుల పాటు మెయిన్ మెయిన్ థియేటర్లను బుక్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ముందునుంచీ రామ్ తన సినిమాని నేరుగా థియేటర్ లోనే రిలీజ్ చేయటానికి ఇంట్రస్ట్ చూపిస్తూ వచ్చాడు.

    Also Read: అంచెలంచెలుగా ఎదిగిన ‘తలైవా’..: నేడు రజనీ పుట్టిన రోజు..

    అనుకున్నట్టుగానే థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నాడు. ఎలాగూ సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న సినిమా కావడంతో, ఈ రెడ్ సినిమా పై మంచి హైప్ ఉండటం కూడా ఈ సినిమా కలెక్షన్స్ కి బాగా కలిసొచ్చేలా ఉంది. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. మరి ఈ సినిమా రామ్ కి ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్