https://oktelugu.com/

మళ్లీ ఈనాడు గ్రూపుకు ఊపు.. రంగంలోకి రామోజీ

తెలుగు నాట పరిచయం అక్కర్లేని పేరు రామోజీరావు.. ఈనాడు సంస్థల అధినేతగా.. మీడియా టైకూన్ గా దేశవ్యాప్తంగా పేరుపొందారు. కట్టుదిట్టమైన సామ్రాజన్యాన్ని నెలకొల్పి మీడియా రంగంతోపాటు పలు వ్యాపార రంగంలో క్రమశిక్షణకు మారుపేరుగా ఎదిగారు. తన మొండి వైఖరి, సమర్థవంతమైన వ్యాపార నిర్వహణ నైపుణ్యాలకు పేరుగాంచిన ఈ 83 ఏళ్ల పులి గత కొన్ని నెలలుగా యాక్టివ్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే ఆయన వ్యాపారాలను పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. Also […]

Written By: NARESH, Updated On : August 24, 2020 7:52 pm
Ramoji rao enters the business again

Ramoji rao enters the business again

Follow us on

Ramoji rao enters the business again
తెలుగు నాట పరిచయం అక్కర్లేని పేరు రామోజీరావు.. ఈనాడు సంస్థల అధినేతగా.. మీడియా టైకూన్ గా దేశవ్యాప్తంగా పేరుపొందారు. కట్టుదిట్టమైన సామ్రాజన్యాన్ని నెలకొల్పి మీడియా రంగంతోపాటు పలు వ్యాపార రంగంలో క్రమశిక్షణకు మారుపేరుగా ఎదిగారు. తన మొండి వైఖరి, సమర్థవంతమైన వ్యాపార నిర్వహణ నైపుణ్యాలకు పేరుగాంచిన ఈ 83 ఏళ్ల పులి గత కొన్ని నెలలుగా యాక్టివ్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే ఆయన వ్యాపారాలను పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది.

Also Read : పాత కలకత్తాలో సాయి పల్లవి విలన్ !

తన వ్యాపార స్రామాజ్యం పగ్గాలను ఇటీవలే తన కొడుకు, కోడలుకు తాత్కాలికంగా రామోజీరావు అప్పగించాడు. సక్సెస్ అయితే పూర్తిగా అప్పగించేస్తానని అనుకున్నాడు. అందుకే రోజువారీ కార్యకలాపాలకు రామోజీరావు దూరంగా ఉన్నాడు. కీలక నిర్ణయాలు.. బోర్డు మీటింగ్ ఆమోదాలకు మాత్రమే పరిమితమవుదామని అనుకున్నారు. విశ్రాంతి తీసుకొని సైడ్ అయిపోదామని అనుకున్నాడు.

కానీ ఈ టైంలోనే వచ్చిన కరోనా మహమ్మారి రామోజీ వ్యాపార సామ్రాజ్యాన్ని పునాదుల నుంచి కదిలించింది. పైనుంచి కూలడం ఆరంభమైంది. భారీగా ఖర్చు, వ్యయం ప్రతీరోజు అవసరమయ్యే రామోజీ ఫిల్మ్ సిటీ తీవ్ర సంక్షోభంలోకి మునిగిపోయింది. ఇక మొన్నటి వరకు రామోజీ ఎడిటర్ గా ఉన్న ఈనాడు గ్రూపు భారీ ఆర్థికనష్టాల్లో కూరుకుపోయింది.
తెలుగురాష్ట్రాల్లోనే అత్యధిక సర్క్యూలేషన్ కలిగిన ఈనాడు పత్రిక దేశంలోని ఇతర పత్రికలలాగే సిబ్బందిపై వేటు వేసి నష్టాలను తగ్గించుకోవడానికి పత్రికల ప్రచురణను తగ్గించుకుంది.

తాజాగా కేంద్రం షూటింగ్ లకు దేశవ్యాప్తంగా అనుమతిని ఇవ్వడంతో బయట కంటే స్టూడియోల్లో నిర్మాణానికి చిత్రం యూనిట్లు మొగ్గుచూపుతున్నాయి. బాలీవుడ్ నుంచి భారీగా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ ల కోసం వస్తున్నారట.. ఈ క్రమంలోనే రామోజీ ఫిలింసిటీని తిరిగి గాడినపడేయడానికి రామోజీ ప్రయత్నాలు ప్రారంభించారట.

Also Read : మెగాస్టార్ ‘ఆచార్య’ షూటింగ్ డిటైల్స్ !

ఇక ఈనాడును తిరిగి ట్రాక్ లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని.. తెలుగు పత్రిక పాఠకుల సంఖ్యను.. ప్రచురణను పెంచి తిరిగి నంబర్ 1 స్థానాన్ని పునరుద్దరించాల్సిన అవసరం ఉందని రామోజీ రంగంలోకి దిగారట.. ఈ క్రమంలోనే విశ్రాంతిని పక్కనపెట్టి తిరిగి తన వ్యాపారంలో చురుకైన పాత్రను పోషించాలని రామోజీరావు నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

 
ప్రస్తుతం రామోజీ ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని కార్యకలాపాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారట..
వార్తాపత్రిక.. దాని మార్కెటింగ్‌తో సహా ఈనాడు వ్యాపార సామ్రాజ్యం   కీర్తిని పునరుద్ధరించడానికి మీడియా మొఘల్ వ్యూహాలను రూపొందిస్తున్నారట..రామోజీ రావు మిగతా కార్యకలాపాలన్నింటినీ తిరిగి తన చేతుల్లోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఈనాడు తిరిగి పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది.