RGV – Ashu Reddy : తెలివితేటలు ఎక్కువైతే మనిషి పిచ్చోడు అవుతాడట. ఒకప్పుడు దేశం మెచ్చిన దర్శకుడిగా ఉన్న రామ్ గోపాల్ వర్మ చేసే పనులు దారుణంగా ఉంటాయి. ఈ మేధావి క్రమంగా దిగ జారుతూ నేలపైకి వచ్చేశాడు. తాజాగా నేల మీద నుండి ఏకంగా పాతాళంలో పడిపోయాడనిపిస్తుంది. ఒక అమ్మాయి కాలు నోట్లో పెట్టుకోవడం ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడం పిచ్చికి పరాకాష్టకాక ఇంకేంటి. అసలు వర్మ ఏం ఆశించి ఇదంతా చేస్తున్నాడు. ఒకవేళ ఆయన పెద్ద శృంగార పురుషుడు అయితే నాలుగు గోడల మధ్య నిరూపించుకుంటే సరిపోతుంది.

ఆయన రోత అందరికి తెలియాల్సిన అవసరం ఏముంది?. కాదు డబ్బుల కోసం అనుకోవడానికి, వర్మ గతిలేని వాడేమీ కాదు. ఫార్మ్ లో ఉన్నప్పుడు కోట్లు కూడబెట్టాడు. ఆయనకంటూ సంపద, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఆడవాళ్లు, ఆల్కహాల్ వర్మ తన ఫాంటసీలు అంటారు. ఈ బలహీనతలు సమాజంలో చాలా మందికి ఉంటాయి. కొందరు అణుచుకుంటారు. మరికొందరు రహస్యంగా తీర్చుకుంటారు. వర్మ వలె ఎముకలు మెళ్ళో వేసుకొని తిరగరు.
ఒక ఐశ్వర్య రాయ్… ఒక శ్రీదేవి వంటి భూలోక సుందరీమణులతో సినిమాలు చేసిన వర్మ అషురెడ్డి అందాలకు బానిసనయ్యానని చెప్పుకోవడం ఊహకు కూడా అందని విషయం. వర్మ రోజంతా ఆల్కహాల్ మత్తులో ఉంటారు. సాయంత్రమైతే దాని మోతాదు పెరుగుతుంది. ఆ తిక్కలో వర్మ చేసే సోషల్ మీడియా పోస్ట్స్ శృతి మించుతాయి. ఎంత కిక్కులో ఉన్నా, వర్మ ట్వీట్స్ లో ఒక్క అక్షర దోషం ఉండదు. అంటే అవి మత్తులో చేసే పనులు కాదు ప్రతిదీ ప్రణాళికలో భాగమే అనిపిస్తుంది. ఒకప్పుడు ప్రముఖుల ఇమేజ్ డ్యామేజ్ చేయడమే పనిగా పెట్టుకున్న వర్మ కొన్నాళ్లుగా అడల్ట్ కంటెంట్ నమ్ముకుంటున్నారు.
థ్రిల్లర్, డేంజరస్, క్లైమాక్స్, నగ్నం శృంగారభరిత చిత్రాలుగా, షార్ట్ ఫిలిమ్స్ గా వర్మ రూపొందించారు. గాడ్ సెక్స్ ట్రూత్ పేరుతో పోర్న్ మూవీ తెరకెక్కించిన ఘనుడు వర్మ. అది కూడా ఓకే… అషురెడ్డితో ఆయన డర్టీ పిక్చర్ హద్దులు దాటేసింది. ఆమెను దేవుడు సృష్టించిన అద్బుతంగా వర్ణిస్తూ, కాళ్ళను చేతులతో తాకడం, ముద్దు పెట్టుకోవడం మ్యాడ్నెస్ అనుకోవాలి. అంచనాలు అందనివి చేయడమే వర్మ స్పెషాలిటీ. ఆ మార్కు మసక బారకుండా ఎప్పటికప్పుడు వర్మ ఇలాంటి షాక్స్ ఇస్తూనే ఉంటాడు. రానున్న కాలంలో ఆయన ఇంకెన్ని దారుణాలు పరిచయం చేస్తాడో చూడాలి.