G20 – Ram charan : #RRR చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ ఎవ్వరూ కలలో కూడా ఊహించని రేంజ్ కి చేరుకున్నాడు. అంతర్జాతీయ లెవెల్ లో ఆయన క్రేజ్ విస్తరింపబడింది. భారత దేశ ప్రభుత్వం కూడా రామ్ చరణ్ ఇండియన్ సినిమాకి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ గా పరిగణిస్తుంది. అందుకే ఈ ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ 20 సమ్మిట్ మీటింగ్ కి రామ్ చరణ్ ని పాల్గొనాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించారు.
చైనా మరియు టర్కీ దేశానికీ చెందిన ప్రతినిధులు మినహా, మిగిలిన దేశాలన్నింటికీ సంబంధించిన ప్రతినిధులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కి ఒక అతిథి గా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తరుపున హాజరైన రామ్ చరణ్ ని అక్కడికి వచ్చిన వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఎంతో గౌరవించారు. వాళ్ళందరి సమక్షం లో రామ్ చరణ్ ఇచ్చిన ప్రసంగం ప్రతీ తెలుగోడు గర్వించదగినట్టుగా ఉంది.
ఇండియా లో ఇంత మంది స్టార్ హీరోలు మరియు సూపర్ స్టార్లు ఉండగా, రామ్ చరణ్ ని ప్రత్యేకించి ఆహ్వానించారంటే ఆయన రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇంత ముఖ్యమైన మీటింగ్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ ‘ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర గల మన భారతదేశ సంస్కృతి మరియు నాగరికత గురించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తరుపున ఇక్కడికి వచ్చి మాట్లాడే అవకాశం దొరకడం నా అదృష్టం గా భావిస్తున్నాను. ఒక అద్భుతమైన కంటెంట్ ని ఉన్నతమైన విలువలతో వెండితెర మీద ఆవిష్కరించే గొప్పదనం మన ఇండియన్ సినిమాల్లో ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మన దేశం లో ఎంతో సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి, వాటిని మేము వెండితెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాము, ఎంతో సుందరమైన ఈ ప్రాంతాలను సురక్షితంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిలో ఉంది. మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం’ అంటూ ఆయన ఇచ్చిన ప్రసంగం కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ ఇచ్చిన స్పీచ్ ని సెంట్రల్ టూరిజం మినిస్టర్ జి. కృష్ణ రెడ్డి ప్రశంసించారు. రామ్ చరణ్ తన మనసులో చెప్పాలనుకున్న విషయాలను అద్భుతంగా చెప్పి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాల హృదయాలను గెలుచుకున్నాడు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తరుపున ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడడం మాకు ఎంతో గర్వంగా ఉండి అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తాడు జి. కృష్ణ రెడ్డి.