Prabhas – Ramcharan : సినీ ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనలు వింటే చాలా తమాషాగా ఉంటాయి. ముఖ్యంగా సినిమా స్టోరీల విషయంలో కొన్ని సార్లు అద్భుతాలు జరుగుతాయి. ఒక హీరో నో చెప్పిన కథ తో మరో హీరో సూపర్ హిట్ కొడతాడు. ఒక హీరో వద్దన్నా జోనర్ స్టోరీ తో మరో హీరో బ్లాక్ బస్టర్ కొడుతాడు. ఇలాంటి సంఘటనలు గతంలో జరిగిన కానీ తాజాగా బయటకు వచ్చింది.
రామ్ చరణ్ కెరీర్ లో గుర్తుపెట్టుకుని సినిమాల లిస్ట్ లో “ధ్రువ” సినిమా ముందు వరుసలో ఉంటుంది. గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ లాంటి సినిమాలు ప్లాప్ కావడంతో చరణ్ గ్రాఫ్ పరంగా కొంచెం వెనకపడ్డాడు. ఆ సమయంలో వచ్చింది “ధ్రువ” . స్టయిలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి, చరణ్ కెరీర్ కి బూస్ట్ ఇచ్చింది. తమిళంలో హిట్ గా నిలిచిన ‘తని ఒరువన్’ చిత్రానికి అఫీషియల్ రీమేక్ ఈ సినిమా.
తమిళంలో జయం రవి హీరోగా మోహన్ రాజా తెరకెక్కించిన తని ఒరువన్ మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ ఈ సినిమాను మొదటిగా ప్రభాస్ కోసం రాసుకున్న, కానీ ప్రభాస్ లవ్ స్టోరీ సినిమా చేయాలనీ చెప్పటంతో జయం రవి తో తెరకెక్కించానని చెప్పాడు. అక్కడ హిట్ కావడంతో తెలుగులో రామ్ చరణ్ దానిని రీమేక్ చేశాడు. ఒకవేళ ప్రభాస్ ఒప్పుకుని ఉంటే ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి రిలీజ్ అయ్యేది.
ఈ సినిమా తమిళంలో 2015 ఆగస్టు 28 న విడుదలైంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్ గా నటించి మెప్పించారు. తెలుగు 2016 లో విడుదలైన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. తమిళంలో విలన్ గా చేసిన అరవింద్ స్వామి తెలుగు లో కూడా అదే రోల్ చేయడం విశేషం. ఇక ఇప్పుడు ‘తని ఒరువన్’ సీక్వెల్ తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జయం రవితో ఈ సినిమా ఉంటుందా ? లేక కొత్త నటీనటులను తీసుకుంటారా ? అనేది ఇంకా తెలియలేదు. అప్పట్లో చరణ్ కేవలం తెలుగులోనే స్టార్ హీరో కాబట్టి ధైర్యంగా రీమేక్ చేశాడు. కానీ ఇప్పుడు గ్లోబల్ స్టార్ కాబట్టి ధ్రువ సీక్వెల్ ని రీమేక్ చేస్తాడా లేదా అనేది కూడా అనుమానమే. లేకపోతే చరణ్ హీరోగా పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కిస్తారా అనేది కూడా చూడాలి. మోహన్ రాజా తో మెగా ఫ్యామిలీ కి మంచి అనుబంధమే ఉంది.
రీసెంట్ గా మెగాస్టార్ హిట్ కొట్టిన గాడ్ ఫాదర్ సినిమా ను మోహన్ రాజా నే తెరకెక్కించాడు. నిజానికి ధ్రువ సీక్వెల్ స్టోరీ గురించి మాట్లాడడానికి చరణ్ ని కలవడానికి వచ్చిన మోహన్ రాజా అనుకోని విధంగా గాడ్ ఫాదర్ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కాబట్టి ధ్రువ సీక్వెల్ భారీ సినిమా గా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించిన ఆశ్చర్యం లేదు. పైగా తెలుగులో ధ్రువ తీసిన సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమాతో భారీ డిజాస్టర్ తీశాడు. దీంతో రామ్ చరణ్- మోహన్ రాజా జోడి ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ