https://oktelugu.com/

Khushi Collections : ఖుషి మూవీ 2వ రోజు కలెక్షన్స్… కొనసాగుతున్న విజయ్ దేవరకొండ జోరు!

ఆదివారం కూడా ఈ సినిమా వసూళ్లు గట్టిగా ఉన్నట్టు తెలుస్తుంది. పైగా జైలర్ వచ్చి చాలా రోజులు కావడం, థియోటర్లో సరైన సినిమా ఏది లేకపోవడం కూడా ఖుషి కి బాగా కలిసి వచ్చే అంశం.

Written By:
  • NARESH
  • , Updated On : September 3, 2023 / 01:49 PM IST

    khushi

    Follow us on

    Khushi Collections : విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ఖుషి సినిమా రీసెంట్ గా విడుదలై, డీసెంట్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని చోట్ల నుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాబట్టుకుంటుంది ఈ సినిమా. సూపర్ హిట్ అనే టాక్ రాకపోయిన కానీ హిట్ టాక్ అయితే వచ్చింది. దీంతో ఖుషి వసూళ్లు కూడా అదే స్థాయిలో కనిపిస్తున్నాయి. మొదటి నుంచి సినిమా మీద మంచి అంచనాలు ఉండటం తో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే జరిగాయి.

    మొదటిరోజు వరల్డ్ వైడ్ గా దాదాపు 28 కోట్లు వసూళ్లు చేసిన ఈ సినిమా రెండో రోజు దాదాపు 16 కోట్లు పైగా కలెక్షన్స్ సాధించింది. కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లో రెండో రోజు దాదాపు 10 కోట్లు గ్రాస్ కొల్లగొట్టింది ఖుషి సినిమా. ఒక్క నైజాం లోని రెండు రోజు దాదాపు 3. 3 కోట్లు నెట్ వసూళ్లు చేసింది ఈ సినిమా. ఆంధ్ర, సీడెడ్ లో మరో రెండు కోట్లు నెట్ వసూళ్లు చేసింది.

    ఓవరాల్ గా ఖుషి సినిమా మొదటి రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల గ్రాస్ సాధించింది. వరల్డ్ వైడ్ గా దాదాపు 44 కోట్ల గ్రాస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 53 కోట్లు నెట్ వసూళ్లు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 23 కోట్ల నెట్ వసూళ్లు చేసిన ఖుషి. బ్రేక్ ఈవెన్ కావడానికి మరో 30 కోట్ల నెట్ సాదించాలి.

    ఆదివారం కూడా ఈ సినిమా వసూళ్లు గట్టిగా ఉన్నట్టు తెలుస్తుంది. పైగా జైలర్ వచ్చి చాలా రోజులు కావడం, థియోటర్లో సరైన సినిమా ఏది లేకపోవడం కూడా ఖుషి కి బాగా కలిసి వచ్చే అంశం.

    ఖుషి రోజూవారి వసూళ్లు…

    డే 1: 9.87 కోట్లు
    డే 2: 5.36 కోట్లు
    AP/TG మొత్తం:- 15.23 కోట్లు షేర్ (24.90 కోట్ల గ్రాస్)

    ఖుషి 2వ రోజు AP/ TG కలెక్షన్స్

    నైజాం: 3.30 కోట్లు
    సీడెడ్: 43 లక్షలు
    UA: 56 లక్షలు
    తూర్పు: 26 లక్షలు
    పశ్చిమ: 15 లక్షలు
    గుంటూరు: 27 లక్షలు
    కృష్ణ: 26 లక్షలు
    నెల్లూరు: 13 లక్షలు
    AP-TG మొత్తం:- 5.36 కోట్ల షేర్ (9.05 కోట్ల గ్రాస్ )

    1వ రోజు వరల్డ్ వైడ్ రూ. 15.37 కోట్ల షేర్ (27.25 కోట్ల గ్రాస్)
    2వ రోజు వరల్డ్ వైడ్ రూ. 8.46 కోట్ల షేర్ (16.05 కోట్ల గ్రాస్)